పెళ్లి కోసం అబద్ధం ఆడాం.... ఒప్పుకున్న అనుష్క శర్మ

Siva Kodati |  
Published : Mar 05, 2019, 08:08 AM IST
పెళ్లి కోసం అబద్ధం ఆడాం.... ఒప్పుకున్న అనుష్క శర్మ

సారాంశం

1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు పెద్దలు. ఈ సూత్రాన్ని పాటించారో ఏమో కోహ్లీ, అనుష్కలు తమ ప్రేమను పండించుకోవడానికి ఒక అబద్ధం ఆడారు

1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు పెద్దలు. ఈ సూత్రాన్ని పాటించారో ఏమో కోహ్లీ, అనుష్కలు తమ ప్రేమను పండించుకోవడానికి ఒక అబద్ధం ఆడారు. ఈ విషయాన్ని స్వయంగా అనుష్క శర్మ తెలిపారు.

కొన్నేళ్ళుగా సాగుతున్న ప్రేమకు ఫుల్‌స్టాప్ పెట్టిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ-బాలీవుడ్ నటి అనుష్క శర్మ 11 డిసెంబర్ 2017న ఇటలీలో వివాహం చేసుకున్నారు. భారత మీడియా వర్గాలకు వీరి వివాహ విషయంపై ముందే తెలిసిపోవడంతో... దేశవ్యాప్తంగా నానాహంగామా నడిచింది.

కోహ్లీ కొన్ని రోజులు సెలవు తీసుకోవడం, అనుష్మ కూడా షూటింగ్‌కు పెకప్ చెప్పడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ క్రమంలో ఈ జంట కుటుంభసభ్యులు, బంధు మిత్రుల సమక్షంలో వివాహం చేసుకుంది.

అయితే తాము పెళ్లి కోసం ఒక పెద్ద అబద్ధం ఆడామని తెలిపారు అనుష్క. ఆ సమయంలో ప్రైవసీ కోసం ఇద్దరం అసలు పేర్లను దాటిపెట్టి నకిలీ పేర్లు చెప్పినట్లుగా పేర్కొంది.. చివరికి కేటరర్‌కి కూడా తప్పుడు పేరు, వివరాలు ఇచ్చినట్లు వెల్లడించింది.

విరాట్ తన పేరును రాహుల్‌గా చెప్పాడని గుర్తు చేసుకుంది. ఈ వివాహాన్ని పెద్ద సెలబ్రిటీ వెడ్డింగ్‌లా చేయకూడదనే ఉద్దేశ్యంతోనే అలా తప్పుడు పేర్లు చెప్పామని, కేవలం ప్రైవసీ కోసం తప్పించి మరో ఉద్దేశ్యం లేదని అనుష్క శర్మ స్పష్టం చేశారు.

PREV
click me!

Recommended Stories

Virat Kohli : 15 ఏళ్ల తర్వాత కోహ్లీ రీఎంట్రీ.. వచ్చి రాగానే సెంచరీతో రచ్చ!
Rohit Sharma : 27 ఫోర్లు సిక్సర్లతో రఫ్ఫాడించిన రోహత్ శర్మ.. విజయ్ హజారే ట్రోఫీలో హిట్ మ్యాన్ షో