నువ్వు ఖాళీ క్రీజులో వుండు, అంతా నేను చూసుకుంటా: ధోనితో జాదవ్

By Arun Kumar PFirst Published Mar 4, 2019, 4:11 PM IST
Highlights

హైదరాబాద్ వన్డేలో కీలకమైన సమయంలో రాణించి టీమిండియా విజయంలో కీలపాత్ర పోషించాడు యువ క్రికెటర్ కేధార్ జాదవ్. అయితే ఈ మ్యాచ్ లో అంత విశ్వాసంతో ఆడటానికి మాజీ  కెప్టెన్, సహచర ఆటగాడు మహేంద్రసింగ్ ధోనినే కారణమని జాదవ్ తాజాగా పేర్కొన్నాడు. ధోనితో కలిసి బ్యాటింగ్ చేస్తున్నంతసేపు ఎక్కడలేని ఆత్మవిశ్వాసం వచ్చిందన్నాడు. ఆయన సలహాలు, సూచనలేవీ  ఇవ్వకున్నా అలా క్రీజులో నిల్చుంటే చాలు బ్యాటింగ్ చేస్తున్న తనలాంటి జూనియర్లకు పరుగులు సాధించడం ఈజీగా  మారిపోతుందంటూ ధోనిపై జాదవ్ ప్రశంసల వర్షం కురిపించాడు.

హైదరాబాద్ వన్డేలో ఆసిస్ జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని చేధించడంతో భారత్ మొదట్లో కాస్త తడబడిన విషయం తెలిసిందే. వరుసగా వికెట్లు కోల్పోతూ టీమిండియా కష్టాల్లోకి జారుకుంటున్న సమయంలో ధోని, జాదవ్ చక్కటి ఇన్నింగ్స్ నెలకొల్పి విజయతీరాలకు చేర్చారు. కేవలం వీరిద్దరే 141 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ధోనీ 59 పరుగులతో,  జాదవ్ 81 పరుగులతో నాటౌట్ గా చివరివరకు నిలిచి భారత్ కు విజయాన్ని అందించారు. 

అయితే ఈ మ్యాచ్ కు ముందు జరిగిన ప్రాక్టిన్ సెషన్లో ధోని గాయపడ్డాడు. దీంతో అతడు క్రీజులోకి వచ్చిన వెంటనే కాస్త ఇబ్బందికి గురయ్యాడని జాదవ్ తెలిపారు. ఆ సమయంతో అతడి వద్దకు వెళ్ళి '' నువ్వు కేవలం క్రీజులో  వుండు చాలు... ఆ ఆత్మవిశ్వాసంతో నేనే అంతా చేసుకుంటా''  అన్నానని జాదవ్ బయటపెట్టాడు. అలా అతడు క్రీజులో వున్నాడన్న ధైర్యంతోనే స్వేచ్చగా బ్యాటింగ్ చేయగలిగానని జాదవ్ వెల్లడించాడు. 

సహచర ఆటగాళ్ళ నుండి అత్యుత్తమ ప్రదర్శనను రాబట్టడం ఎలాగో ధోనికి తెలుసన్నాడు. అదేవిధంగా తన నుండి కూడా మంచి ఇన్సింగ్స్ రాబట్టి విజయంతో కీలకపాత్ర పోషించేలా చేశారన్నారు. అందువల్లే  హైదరాబాద్ వన్డేలో విజయం సాధ్యమైందని జాదవ్ వివరించాడు.
 
click me!