భారత జట్టులో 11మంది కోహ్లీలు వుండుంటే...: మాజీ క్రికెటర్

Published : Mar 12, 2019, 03:50 PM IST
భారత జట్టులో 11మంది కోహ్లీలు వుండుంటే...: మాజీ క్రికెటర్

సారాంశం

ప్రపంచ కప్ కు ముందు ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సీరిస్ చివరి రెండు మ్యాచుల్లో భారత జట్టు వరుస ఓటములను చవిచూసిన  విషయం తెలిసిందే.  ఆతిథ్య ఆస్ట్రేలియా మొదటి రెండు వన్డేల్లో ఓడినా కీలక సమయంలో పుంజుకుని రాంచీ, మొహాలీ వన్డేల్లో విజయాలను సాధించింది. టీమిండియా స్వదేశంలో జరుగుతున్న ఐదు వన్డేల సీరిస్ ను ఆసిస్ 2-2తో సమం చేసింది. ఇలా భారత్ వరల్డ్ కప్ కు ముందు వరుస ఓటములను చవిచూడటం...మరీ ముఖ్యంగా మొహాలిలో 358 పరుగులను కూడా కాపాడుకోలేకపోవడంతో ఆటగాళ్లు తీవ్ర విమర్శలపాలవుతున్నారు. 

అయితే ఇలా ఇబ్బందులను ఎదర్కొంటున్న టీమిండియాకు శ్రీలంక మాజీ ప్లేయర్, లెజెండరీ స్పిన్నర్ మత్తయ్య మరళీధరన్ అండగా నిలిచాడు. భారత జట్టు ఈ మధ్య కాలంలో చాలా అద్భుతమైన ఆటతీరును కనబరుస్తోందని ప్రశంసించారు. అయితే అందులో కొన్ని మ్యాచులను ఓడిపోయి వుండోచ్చన్నారు. ప్రతి మ్యాచులో విజయం సాధించాలంటే జట్టు మొత్తం విరాట్ కోహ్లీలే వుండాలన్నారు. అలా 11 మంది ఆటగాళ్లు మ్యాచ్ విన్నర్లు అయినప్పుడే ఓటమన్నదే లేకుండా విజయాలు సాధించడం సాధ్యమవుతుందని  పేర్కొన్నారు. కానీ అలా జరగదు కదా... అని మురళీధరన్ వివరించారు. 

వరల్డ్ కప్ ముందు చివరగా జరుగుతున్న వన్డేల్లో భారత జట్టు ప్రయోగాలకు ప్రయత్నించడం మంచిదేనన్నారు. ఇలా అన్ని విభాగాల్లో ప్రయోగాలు చేయడం ద్వారా అత్యుత్తమ ఆటగాళ్లను గుర్తించడం సాధ్యపడుతుందన్నారు. ఈ క్రమంలోనే కొన్ని ఓటములు కూడా ఎదురవుతాయని...వాటిని సీరియస్ గా తీసుకుని జట్టు మొత్తాన్ని విమర్శిస్తూ ఆటగాళ్లను ఒత్తిడిలోకి నెట్టడం మంచిదికాదని మరళీధరన్ సూచించారు. 

PREV
click me!

Recommended Stories

Shubman Gill : టీ20 వరల్డ్ కప్ ఎఫెక్ట్.. బీసీసీఐ షాకిచ్చినా గ్రౌండ్ లోకి దిగనున్న శుభ్‌మన్ గిల్ !
ఆ మ్యాచ్ తర్వాతే రిటైర్మెంట్ ఇచ్చేద్దామనుకున్నా.. కానీ.! రోహిత్ సంచలన వ్యాఖ్యలు