ధోనీ కూడా గొప్ప కీపరేం కాదు...కానీ ఆయనకు అలా కలిసొచ్చింది: కోచ్

By Arun Kumar PFirst Published Mar 12, 2019, 1:53 PM IST
Highlights

మొహాలి వన్డేలో భారత జట్టు ఓటమికి యువ వికెట్ కీఫర్ కమ్ బ్యాట్ మెన్ రిషబ్ పంత్ ని బాధ్యున్ని చేస్తూ అభిమానులు విమర్శలకు దిగుతున్న విషయం తెలిసిందే. అతడి చెత్త కీపింగ్ వల్లే భారత్ మంచి అవకాశాలను కోల్పోయి పరాజయం పాలయ్యిందని ఆరోపిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ మ్యాచ్ లో సెంచరీ సాధించిన హ్యాండ్స్ కోబ్ క్యాచ్ మిస్ చేయడం....ధనా ధన్ బ్యాటింగ్ తో రెచ్చిపోయి ఆసిస్ విజయంలో కీలక పాత్ర పోషించిన టర్నర్ స్టంపౌట్ మిస్ చేయడంతో పంత్ పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
అంతేకాకుండా ఆసిస్ బ్యాట్ మెన్‌ను ధోని స్టైల్లో రనౌట్ చేయడానికి ప్రయత్నించి పంత్ విఫలమయ్యాడు. దీంతో అతడిపై ట్రోలింగ్స్ మొదలయ్యాయి. నువ్వేమైనా ధోని అనుకుంటున్నావా? అంటూ సోషల్ మీడియా లో పంత్ పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. 

అయితే ఇలా ఓ యువ క్రికెటర్ ని సీనియర్ వికెట్ కీఫర్ ధోనితో పోల్చడాన్ని పంత్ కోచ్ తారక్ సిన్హా తప్పుబట్టారు. తన శిష్యుడికి బాసటగా నిలిచిన ఆయన...పంత్ ను ధోనితో పోల్చడం ఆపాలన్నారు. వీరిద్దరు వికెట్ కీపర్ కమ్ బ్యాట్ మెన్స్ అయినంత మాత్రాన ఆటతీరు ఒకేలా వుండాలని లేదన్నారు. ఎవరి స్ట్రైల్ వారికుంటుందని పేర్కొన్నారు. ఎంతో అనుభవజ్ఞుడైన ధోనితో ఇప్పుడిప్పుడే కేరీర్ ప్రారంభిస్తున్న ఆటగాడిని పోల్చడం ఎంతవరకు సబబని అభిమానులను ప్రశ్నించారు. 

 కెరీర్ ఆరంభంలో ధోని కూడా ఇలాగే ఎన్నో తప్పులు చేశారని....వాటి నుండి ఆయన పాఠాలు నేర్చుకున్నారని తెలిపారు. కీఫర్ గా చాలా క్యాచ్ లు, స్టంపింగ్ లు మిస్ చేశాడని పేర్కొన్నారు. అయితే ఆ సమయంలో టీమిండియాలో సరైన వికెట్ కీఫర్ ఎవరూ లేకపోవడంతో అతడికి కలిసొచ్చిందని, అందువల్లే అతడిపై ఒత్తిడి లేకుండాపోయిందని తారక్ సిన్హా అభిప్రాయపడ్డారు. 

మొహాలి వన్డేలో ధోనితో పోల్చడం వల్లే పంత్ ఒత్తిడికి గురయ్యాడన్నారు. అలాకాకుండా అతడిపై ఎలాంటి ఒత్తిడి లేకుండా వుంటే తప్పకుండా రాణించేవాడనని అన్నారు. భవిష్యత్ లో అయినా ఇలా పంత్ ను ఇతరులతో పోల్చడం మానుకోవాలని తారక్ సూచించారు. 

click me!