టీమిండియాలో కీలక మార్పులు...ఉమేశ్ యాదవ్ పై వేటు

By Arun Kumar PFirst Published Feb 27, 2019, 7:12 PM IST
Highlights

విశాఖ టీ20 పరాజయానికి కారణమైన ఉమేశ్ యాదవ్ పై వేటు పడింది. అతడు బెంగళూరు టీ20 తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అతడితో పాటు డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ, యువ బౌలర్ మార్కండే  రెండో టీ20 కి దూరమయ్యారు. వారి స్థానంలో ఓపెనర్ శిఖర్ ధావన్, ఆల్ రౌండర్ విజయ్ శంకర్, బౌలర్ సిద్దార్థ్ కౌల్ భారత జట్టులో ,చోటు దక్కించుకుని బెంగళూరులో టీ20 మ్యాచ్ ఆడనున్నారు.  

 విశాఖ టీ20 లో గెలిచి ఊపుమీదున్న ఆసిస్ జట్టు బెంగళూరులో ఇవాళ జరగనున్న రెండో టీ20ని కూడా గెలిచి సీరిస్ క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది. ఇలా స్వదేశంలో భారత్ ను ఓడించి టీ20 సీరిస్ ను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. అందుకోసమే మొదటి టీ20 జట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగింది.

అయితే విశాఖ టీ20 లో గెలవాల్సిన మ్యాచ్ ను ఓడిపోయిన టీమిండియా ఎట్టి పరిస్థితుల్లో రెండో టీ20 గెలవాలని భావిస్తోంది. దీని ద్వారా సీరిస్ ను సమం చేసి ఆసిస్ ఆశలపై నీళ్లు చల్లాలని భావిస్తోంది. ఈ క్రమంలో విశాఖలో అంతగా రాణించలేకపోయిన ఆటగాళ్లును జట్టునుండి తొలగించి వేరేవాళ్లకు అవకాశం కల్పించింది. 

click me!