న్యూజిలాండ్‌లో కాల్పులు: తప్పించుకున్న బంగ్లా క్రికెట్ జట్టు

Siva Kodati |  
Published : Mar 15, 2019, 09:32 AM ISTUpdated : Mar 15, 2019, 09:38 AM IST
న్యూజిలాండ్‌లో కాల్పులు: తప్పించుకున్న బంగ్లా క్రికెట్ జట్టు

సారాంశం

న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లో ఓ మసీదులో దుండగుడు కాల్పులు తెగబడ్డాడు. నల్లరంగు దుస్తులు ధరించిన ఓ సాయుధుడు అల్‌ నూర్ మసీదులోకి ప్రవేశించి ప్రార్థనలు జరుపుతున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు

న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లో ఓ మసీదులో దుండగుడు కాల్పులు తెగబడ్డాడు. నల్లరంగు దుస్తులు ధరించిన ఓ సాయుధుడు అల్‌ నూర్ మసీదులోకి ప్రవేశించి ప్రార్థనలు జరుపుతున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.

ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు ఈ ఘటన నుంచి బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు తృుటిలో తప్పించుకుంది. టెస్ట్ సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌ జట్టుతో మూడో టెస్టు ఆడాల్సి ఉంది. అదృష్టవశాత్తూ బంగ్లా జట్టు ఈ దాడి నుంచి తప్పించుకుంది. మరోవైపు తాము సురక్షితంగా తప్పించుకున్నట్లు క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ ట్వీట్ చేశాడు. 

PREV
click me!

Recommended Stories

ఇంటర్నేషనల్ క్రికెట్లో 35,117 బంతులు, 5850 ఓవర్లు.. కెరీర్లో ఒక్క నోబాల్ వేయని స్టార్ బౌలర్, ఎవరో తెలుసా?
IND vs WI 3rd T20: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.. సిరీస్‌లో టీమిండియా ఆధిక్యం