
నాగ్ పూర్ వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్ లో సాధించిన హాఫ్ సెంచరీతో కోహ్లీ వన్డే కెరీర్లో 50వ అర్థశతకం పూర్తయింది. ఇలా కోహ్లీ వన్డే రికార్డుల సరసన ఈ హాఫ్ సెంచరీల రికార్డు కూడా చేరింది.
మొదట బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఆసిస్ బౌలర్లురు ఆరంభంలో గట్టి షాక్ ఇచ్చారు. ఓపెనర్ రోహిత్ శర్మ డకౌట్‌గా పెవిలియన్ చేరడంతో భారత జట్టు పరుగులేమీ చేయకుండానే తొలి వికెట్‌ను నష్టపోయింది. ఆ సమయంలో క్రీజులో అడుగుపెట్టిన కోహ్లీ సమయోచితంగా ఆడుతూ ఓ వైపు వికెట్లు పడుతున్నా తన పని తాను పూర్తి చేశాడు. ఇలా 55 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో కోహ్లీ హాఫ్ సెంచరీ సాధించి నాటౌట్ గా బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు.
ధావన్ తో కలిసి 38 పరుగులు, అంబటి రాయుడుతో కలిసి మరో 37 పరుగుల భాగస్వామ్యాన్ని కోహ్లీ నెలకొల్పాడు. ఆ తర్వాత విజయ శంకర్ తో కలిసి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పుతున్న సమయంలో శంకర్ రనౌటయ్యాడు. ఆ తర్వాత వెంటవెంటనే జాదవ్, ధోని ల వికెట్లు కూడా పడ్డాయి. అయితే కోహ్లీ మాత్రం ఇంకా నాటౌట్ గా నిలిచా సెంచరీ వైపు దూసుకెళుతున్నాడు.