ప్రపంచ కప్: టీమిండియాకు క్లైవ్ లాయిడ్ హెచ్చరిక

By telugu teamFirst Published Jul 3, 2019, 8:24 AM IST
Highlights

టీమిండియా ఎక్కువగా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ, కెప్టెన్ విరాట్‌ కోహ్లీపై ఆధారపడుతోందని లాయిడ్ అభిప్రాయపడ్డారు.  టీమిండియాలో సెలక్షన్‌ లో అయోమయం చోటు చేసుకుందని ఆయన అన్నారు. వారిపై ఇంగ్లాండ్‌ సరైన దృక్పథంతో ఆడిందని, స్పిన్నర్లపై దాడికి దిగిందని ఆయన అన్నారు. 

బర్మింగ్‌హామ్‌: ప్రస్తుతం ప్రపంచ కప్ పోటీల్లో సెమీ ఫైనల్ కు చేరుకున్న టీమిండియాను వెస్టిండీస్ మాజీ క్రికెటర్ క్లైవ్ లాయిడ్ పరోక్షంగా హెచ్చరించారు. లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ తీరుపై ఆయన ఆ హెచ్చరిక చేశారు. టీమిండియా లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ ను పటిష్టం చేసుకోవాలని ఆయన అన్నాడు.

టీమిండియా ఎక్కువగా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ, కెప్టెన్ విరాట్‌ కోహ్లీపై ఆధారపడుతోందని లాయిడ్ అభిప్రాయపడ్డారు.  టీమిండియాలో సెలక్షన్‌ లో అయోమయం చోటు చేసుకుందని ఆయన అన్నారు. వారిపై ఇంగ్లాండ్‌ సరైన దృక్పథంతో ఆడిందని, స్పిన్నర్లపై దాడికి దిగిందని ఆయన అన్నారు. 

ఆస్ట్రేలియా ఇప్పటికే సెమీస్‌ చేరిందని, టీమిండియా దాదాపు చేరుకున్నట్లేనని అన్నాడు. ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లే అద్భుతంగా ఆడుతున్నాయని, ఇతరుల కన్నా ఈ జట్లే ఇంగ్లాండ్‌ పరిస్థితులను బాగా అర్థం చేసుకున్నాయని అన్నాడు. అదే అత్యంత కీలకమైందని అన్నాడు. 

నాకౌట్‌ మ్యాచుల్లో పిచ్‌లు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని, విండీస్‌ ప్రదర్శన బాధ కలిగిస్తోందని లాయిడ్ అన్నారు. లంకపై ఛేదనలో పూరన్‌ అద్భుతంగా ఆడాడని, అయితే కీలక సమయంలో వికెట్‌ చేజార్చుకున్నాడని అన్నారు. విండీస్‌ క్రికెట్‌, ప్రతిభపై తాను ఆశావహ దృక్పథంతో ఉన్నట్లు తెలిపాడు.

click me!