కివీస్ పై పాకిస్తాన్ గెలిచి తీరుతుంది: వసీం అక్రమ్ ధీమా

By telugu teamFirst Published Jun 26, 2019, 6:42 AM IST
Highlights

న్యూజిలాండ్‌తో జరగబోయే కీలక మ్యాచ్‌లో ఎటువంటి మార్పుల్లేకుండా విన్నింగ్‌ టీంనే బరిలోకి దింపాలని  వసీం అక్రమ్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌కు సూచించాడు. 1992 వరల్డ్‌కప్‌ ఫీట్‌ను పాక్‌ జట్టు పునరావృతం చేస్తుందని అక్రమ్‌ అన్నాడు. పాకిస్తాన్ కు చెంద్ిన మీడియా చానెల్ తో అక్రమ్ మాట్లాడారు.

బర్మింగ్‌హమ్‌: న్యూజిలాండ్ పై  తమ పాకి,స్తాన్ జట్టు గెలుస్తోందని ఆ జట్టు మాజీ ఆటగాడు వసీం అక్రమ్ విశ్వాసం వ్యక్తం చేశాడు. పాకిస్తాన్ బుధవారం న్యూజిలాండ్ తో తలపడనుంది. టీమిండియాపై ఓటమి తర్వాత దక్షిణాఫ్రికాపై పాకిస్తాన్ విజయం సాధించింది. ఈ విజయం ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో బలమైన కివీస్ జట్టును పాకిస్తాన్ ఎదుర్కోబోతోంది.

న్యూజిలాండ్‌తో జరగబోయే కీలక మ్యాచ్‌లో ఎటువంటి మార్పుల్లేకుండా విన్నింగ్‌ టీంనే బరిలోకి దింపాలని  వసీం అక్రమ్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌కు సూచించాడు. 1992 వరల్డ్‌కప్‌ ఫీట్‌ను పాక్‌ జట్టు పునరావృతం చేస్తుందని అక్రమ్‌ అన్నాడు. పాకిస్తాన్ కు చెంద్ిన మీడియా చానెల్ తో అక్రమ్ మాట్లాడారు.

1992 వరల్డ్‌కప్‌లో వరుస విజయాలతో ఊపుమీదున్న న్యూజిలాండ్‌ను 7 వికెట్ల తేడాతో పాక్‌ చిత్తుగా ఓడించిన విషయాన్ని ఆక్రమ్‌ గుర్తుచేశాడు. ఇప్పుడు కూడా అదే పునరావృతం అవుతుందని అభిప్రాయపడ్డాడు. అలాగే పాక్‌ జట్టు ఫీల్డింగ్‌లో చాలా మెరుగుపడాల్సిన అవసరం ఉందని అన్నాడు. 

ఈ టోర్నీలో ఇప్పటివరకు 14 క్యాచ్‌లను నేలపాలు చేసి అత్యధిక క్యాచ్‌లను జారవిడిచిన జట్లలో పాక్‌ తొలి స్థానంలో నిలవడం మంచిది కాదని అక్రమ్‌ హెచ్చరించాడు. పాక్‌ టాపార్డర్‌ రాణిస్తున్నప్పటికీ మిడిలార్డర్‌, లోయర్‌ ఆర్డర్‌ వైపల్యంతో ఓడిపోతున్నామని అన్నాడు. వన్‌డౌన్‌లో వస్తున్న బాబర్‌ అజమ్‌ భారీ ఇన్నింగ్స్‌లు ఆడటంలో విఫలమవుతున్నాడని తెలిపాడు.

పాక్‌ జట్టు ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లు ఆడి రెండు గెలిచి 5 పాయింట్లతో పట్టికలో 7వ స్థానంలో నిలిచింది. సెమీస్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే మిగతా మూడు మ్యాచ్‌లు తప్పక గెలవాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఇతర జట్ల జయాపజయాలపై కూడా పాకిస్తాన్ ఆధారపడాల్సి వస్తోంది. 

click me!