ఇండియాను సపోర్ట్ చేయండి: పాక్ ఫ్యాన్స్ కు షోయబ్ అక్తర్ పిలుపు

By telugu teamFirst Published Jun 30, 2019, 7:07 PM IST
Highlights

వరుస విజయాలు సాధిస్తూ రేసులోకి వచ్చిన పాక్‌ అవకాశాలు మరింత మెరుగుపడే అవకాశం ఉంది. దాంతోనే ఇంగ్లాండ్‌పై భారత్‌ గెలవాలని పాక్‌ అభిమానులు కోరుకుంటున్నారు. దీనికి పాక్‌ మాజీ ఆటగాళ్ల నుంచి కూడా మద్దతు లభిస్తోంది.

బర్మింగ్‌హామ్‌: ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా ఆదివారం ఇంగ్లాండుకు, ఇండియాకు మధ్య జరుగుతున్న మ్యాచులో ఇండియాను సపోర్ట్ చేయాలని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ తన దేశం క్రికెట్ అభిమానులకు పిలుపునిచ్చారు. ఈ మ్యాచుపై పాకిస్తాన్ దృష్టి పడింది. దాంతో సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. 

ఈ మ్యాచ్‌లో మీ సపోర్ట్‌ ఎవరికి అని పాకిస్తాన్‌ క్రికెట్‌ అభిమానులకు ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ నాసీర్‌ హుస్సేన్‌ ఒక ప్రశ్న సంధించడంతో ఇప్పుడు అదే హాట్‌ టాపిక్‌ అయిందిభారత్‌కే సపోర్ట్‌ అంటూ పాక్‌ అభిమానుల్లో అత్యధికులు చెప్పారు. ఇందుకు కారణం భారత్‌పై ఇంగ్లాండు ఓడిపోతే సెమీస్‌ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. 

అంతేకాకుండా వరుస విజయాలు సాధిస్తూ రేసులోకి వచ్చిన పాక్‌ అవకాశాలు మరింత మెరుగుపడే అవకాశం ఉంది. దాంతోనే ఇంగ్లాండ్‌పై భారత్‌ గెలవాలని పాక్‌ అభిమానులు కోరుకుంటున్నారు. దీనికి పాక్‌ మాజీ ఆటగాళ్ల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. టీమిండియాకే మద్దతు ఇవ్వాలని పాక్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ తన దేశ అభిమానులకు విన్నవించాడు. 

పాకిస్తాన్‌లో ఉండే పాక్‌ అభిమానులు ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో భారత్‌కే సపోర్ట్‌ చేయాలని, పాకిస్తాన్‌ సెమీస్‌కు క్వాలిఫై అవ్వాలంటూ ఇంగ్లండ్‌ ఓడిపోవాలని అన్నాడు. అప్పుడు బంగ్లాదేశ్‌పై పాక్‌ గెలిస్తే సెమీస్‌కు ఎటువంటి సమీకరణాలు లేకుండా వెళుతుందని విశ్లేషించాడు. 

భారత్‌-పాకిస్తాన్‌ జట్ల మధ్య సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ను చూడాలని తాను అనుకుంటున్నట్లు తెలిపాడు. అలాగే పాకిస్తాన్‌ వరల్డ్‌కప్‌ గెలవాలని అనుకుంటున్నానని తన యూట్యూబ్‌ ఛానల్‌లో అన్నాడు. అయితే ఇంగ్లాండులో ఉంటున్న పాక్‌ అభిమానులు మాత్రం ఆ జట్టుకే సపోర్ట్‌ ఇస్తారని అనుకుంటున్నానని అక్తర్‌ తెలిపాడు. ఆ దేశపు నీరు, వారి ఆహారం తింటున్నందువల్ల అక్కడి ఉండే పాకిస్తానీలు ఇంగ్లండ్‌కే మద్దతు తెలపడం సమంజసమని అన్నాడు.

click me!