మేం ఎంతో ఎదిగాం.. ఇంకా సంచలనం ఏంటీ: బంగ్లా కెప్టెన్ మొర్తజా

Siva Kodati |  
Published : Jun 04, 2019, 07:57 AM IST
మేం ఎంతో ఎదిగాం.. ఇంకా సంచలనం ఏంటీ: బంగ్లా కెప్టెన్ మొర్తజా

సారాంశం

ప్రపంచకప్‌లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ దక్షిణాఫ్రికాను ఓడించి సంచలనం సృష్టించింది పసికూన బంగ్లాదేశ్. దీంతో ఆ జట్టు సభ్యులు ఖుషీఖుషీగా ఉన్నారు. అయితే మీడియాలో బంగ్లాదేశ్ సంచలనం అని కథనాలు రావడం పట్ల ఆ జట్టు కెప్టెన్ మొర్తజా అసంతృప్తి వ్యక్తం చేశాడు

ప్రపంచకప్‌లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ దక్షిణాఫ్రికాను ఓడించి సంచలనం సృష్టించింది పసికూన బంగ్లాదేశ్. దీంతో ఆ జట్టు సభ్యులు ఖుషీఖుషీగా ఉన్నారు. అయితే మీడియాలో బంగ్లాదేశ్ సంచలనం అని కథనాలు రావడం పట్ల ఆ జట్టు కెప్టెన్ మొర్తజా అసంతృప్తి వ్యక్తం చేశాడు.

ఇకపై తమ జట్టు ఏదైనా పెద్ద జట్లను ఓడిస్తే అది సంచలనంగా చూడొద్దని విజ్ఞప్తి చేశాడు. క్రికెట్‌లో బంగ్లా సాధించిన ప్రగతి ఇదని.. ఇంకా దీనిని ఆశ్చర్యంగానో... సంచలనంగానో చూడొద్దన్నాడు. తాము సర్వశక్తులు ఒడ్డితే ఏదైనా సాధిస్తామని తెలుసునన్నాడు. అ

యితే కొందరు బంగ్లా ఎదుగుదలను తట్టుకోలేకపోతున్నారని మొర్తజా తెలిపాడు. అయినప్పటికీ తాము మాత్రం ఆటపైనే దృష్టి సారిస్తామని.. ఎవరేమనుకుంటే మాకేంటి అని స్పష్టం చేశాడు.

2007 వన్డే ప్రపంచకప్‌ నుంచి బంగ్లాదేశ్ ఆట ఎదుగుతూ వచ్చిందని ఆ జట్టు ఆల్‌రౌండర్ షకీబ్ తెలిపాడు. ఆ ఏడాది ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్.. భారత్, దక్షిణాఫ్రికాలపై సంచలన విజయాలు నమోదు చేసింది. 

PREV
click me!

Recommended Stories

ఓవర్‌ త్రో.. ఆశలు సమాధి: ఈ పరిస్ధితి ఎవరికీ రావొద్దన్న విలియమ్సన్
మా చెత్త ఆట వల్లనే ఓటమి: రోహిత్ శర్మ తీవ్ర ఆవేదన