27 ఏళ్ల సచిన్ రికార్డు బ్రేక్: రోల్ మోడల్ సంగక్కర అంటున్న ఇక్రమ్

By telugu teamFirst Published Jul 5, 2019, 11:46 AM IST
Highlights

హెడింగ్లేలోని ఐసిసి మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ లో 18 ఏళ్ల ఇక్రమ్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. ఈ రికార్డును సచిన్ టెండూల్కర్ 1992లో నెలకొల్పాడు. వెస్టిండీస్ పై జరిగిన మ్యాచులో ఇక్రమ్ 92 బంతుల్లో 86 పరుగులు చేశాడు. 27 ఏళ్ల క్రితం సచిన్ టెండూల్కర్ 84 పరుగులు చేశాడు. 

లండన్: అఫ్గానిస్తాన్ యువ క్రికెటర్ ఇక్రమ్ అలీ ఖిల్ 27 ఏళ్ల కిందటి సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. వెస్టిండీస్ పై గురువారం జరిగిన మ్యాచులో అతను ఆ ఘనత సాధించాడు. అయితే, తనకు మోడల్ శ్రీలంక ఆటగాడు కుమార్ సంగక్కర అని అంటున్నాడు. 

హెడింగ్లేలోని ఐసిసి మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ లో 18 ఏళ్ల ఇక్రమ్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. ఈ రికార్డును సచిన్ టెండూల్కర్ 1992లో నెలకొల్పాడు. వెస్టిండీస్ పై జరిగిన మ్యాచులో ఇక్రమ్ 92 బంతుల్లో 86 పరుగులు చేశాడు. 27 ఏళ్ల క్రితం సచిన్ టెండూల్కర్ 84 పరుగులు చేశాడు. 

అయితే తన రోల్ మోడల్ సచిన్ టెండూల్కర్ కాడని, కుమార్ సంగక్కర అని ఇక్రమ్ అన్నాడు. అయితే, సంగక్కరను అతను ఇప్పటి వరకు కూడా చూడలేదు. తాను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో సంగక్కరనే తనకు గుర్తుకు వస్తాడని ఆయన చెప్పాడు. 

స్ట్రైక్ ను రొటేట్ చేస్తూ అవసరమైనప్పుడు బౌండరీలు చేస్తూ వెళ్లే సంగక్కర సామర్థ్యం తనకు నచ్చిందని అతను అంటున్నాడు. అదే అతన్ని వరల్డ్ క్లాస్ బ్యాట్స్ మన్ గా నిలబెట్టిందని, సంగక్కరను కాపీ చేయడానికి తాను ప్రయత్నిస్తానని చెప్పాడు. 

సచిన్ టెండూల్కర్ వంటి లెజెండ్ రికార్డును బద్దలు కొట్టడం గర్వంగా ఉందని, అందుకు సంతోషం వేసిందని అతను అన్నాడు. తాను 86 పరుగులు చేయడం, అదే టాప్ స్కోర్ కావడం తనకు అనందంగా ఉందని చెప్పాడు. 

తొమ్మిది మ్యాచుల్లో ఎవరు కూడా ఆ పరుగులు చేయలేదని, అయితే సెంచరీ చేయకపోవడం అసంతృప్తిగా ఉందని, వచ్చే మ్యాచుల్లో అది సాధించగలుగుతాననే ఆశ ఉందని అన్నాడు. 

గేమ్ లో కఠిన శ్రమ చేస్తానని, అఫ్గానిస్తాన్ ఉత్తమ క్రికెటర్ గా అవతరిస్తానని చెప్పాడు. ప్రపంచ కప్ అనుభవం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, తన జట్టు సహచరులతో కలిసి ప్రత్యర్థులతో ఆడడం గొప్ప అనుభవమని అన్నాడు. 

click me!