దక్షిణాఫ్రికాకు బిగ్ షాక్...మరో కీలక ఆటగాడు జట్టు నుండి ఔట్

By Arun Kumar PFirst Published Jun 5, 2019, 2:32 PM IST
Highlights

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ మెగా టోర్నీలో దక్షిణాఫ్రికా జట్టుకు మరో షాక్ తగిలింది. టీమిండియాతో బుధవారం జరగనున్న మ్యాచ్ లో అందుబాటులోకి వస్తాడనుకున్న స్టార్ పేసర్ డెల్ స్టెయిన్ ఏకంగా ప్రపంచ కప్ టోర్నీకే దూరమయ్యాడు. ఐపిఎల్ లో అయిన గాయం కారణంగా ప్రపంచ కప్ లో తమ జట్టు ఆడిన మొదటి రెండు మ్యాచ్ లకు అతడు దూరమయ్యాడు.అయితే స్టెయిన్ భారత్ తో జరిగే మ్యాచ్ లో అందుబాటులోకి వస్తాడిని టీం మేనేజ్ మెంట్ గతంలో తెలియజేసింది. అందుకు తగ్గట్లుగానే అతడు మైదానంలో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించడం జట్టులోకి అతడి రాక ఖాయమేనని అందరు భావించారు. 

అయితే తాజాగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) స్టెయిన్ కు సంబంధించి  ఓ ప్రకటన విడుదల చేసింది. అతడు గాయం నుండి ఇంకా కోలుకోకపోవడం...తొందర్లో కోలుకుంటాడన్న నమ్మకం  లేకపోవడంతో ఈ ప్రపంచ కప్ టోర్నీ నుండి తప్పుకున్పట్లు తెలియజేసింది. ఈ మేరకు అతడి నుండి, దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డ్ నుండి తమకు  సమాచారం అందిందని పేర్కొంది. దీంతో ఇప్పటివరకు స్టెయిన్ రాకతో దక్షిణాఫ్రికా బౌలింగ్ విభాగం బలపబడుతుందని భావించిన ఆ జట్టు అభిమానులకు నిరాశ తప్పలేదు. 

స్టెయిన్ స్థానంలో సౌతాఫ్రికా జట్టులోకి  హెండ్రిక్స్ చేరనున్నాడు. అతన్ని ఇంగ్లాండ్ పయనమవ్వాల్సిందిగా దక్షిణాఫ్రికా  క్రికెట్ బోర్డు నుండి  ఆదేశాలు అందాయి. దీంతో అతడు అతి త్వరలో తమ జట్టులో కలవనున్నాడు. అయితే బుధవారం టీమిండియాతో జరగనున్న మ్యాచ్ లో మాత్రం అతడు ఆడే అవకాశాలు కనిపించడం లేదు. 

ఇప్పటికే రెండు ఓటములతో సతమతమవుతున్న సపారీ జట్టుకు లుంగి ఎంగిడి దూరమవడంతో  మొదటి షాక్ తగిలింది. ఆ తర్వాత మళ్లీ ఇలా స్టెయిన్ జట్టుకు దూరమవడంతో రెండో ఎదురుదెబ్బ తగిలింది. వీరిద్దరు జట్టుకు దూరమవడంతో బౌలింగ్ విభాగం బలహీనంగా మారింది.  అయితే  దక్షిణాఫ్రికా జట్టులో చోటుచేపుకుంంటున్న ఈ పరిణామాలన్ని భారత్ కు కలిసిరానున్నాయి.  

click me!