టీమిండియాకు ప్రపంచ కప్ అందించే సత్తా వారిలో వుంది: సచిన్

By Arun Kumar PFirst Published Jun 4, 2019, 7:53 PM IST
Highlights

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా టైటిల్ పేవరెట్ గా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. అయితే గత భారత వరల్డ్ కప్ జట్లతో ప్రస్తుత జట్టును పోలుస్తూ కొందరు అభిమానులు, విశ్లేషకులు విచిత్రమైన అనుమానాన్ని లేవనెత్తుతున్నారు. ఇంతకు ముందు ప్రపంచ కప్ జట్లలో అద్భుతమైన బౌలర్లు వున్నారని...వాటితో పోలిస్తే ప్రస్తుత బౌలింగ్ విభాగం చాలా బలహీనంగా వుందన్నది వారి వాదన. ఈ ప్రపంచ  కప్ లో భారత జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే మన బౌలర్లు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ఇలాంటి ప్రచారం జరగుతోంది. దీంతో ఈ ప్రచారాన్ని తాజాగా క్రికెట్ లెజెండ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తిప్పికొట్టారు. 

టీమిండియా బౌలింగ్ విభాగం నాణ్యమైన బౌలర్లతో పటిష్టంగా వుందని సచిన్ పేర్కొన్నారు. ముఖ్యంగా జస్ప్రీత్ సింగ్ బుమ్రా వంటి ప్రపంచ స్థాయి బౌలర్, యార్కర్ స్పెషలిస్ట్ టీమిండియాలో వుండటం మన జట్టు బౌలింగ్ నాణ్యతను తెలియజేస్తుందని అన్నారు. ఆరంభ, చివరి ఓవర్లలో ప్రత్యర్థుల పని పట్టగల బుమ్రా, భువనేశ్వర్, షమీలు ఓవైపు...మిడిల్ ఓవర్లలో సత్తా చాటగల కుల్దీప్, చాహల్ వంటి అత్యుత్తమ స్పిన్నర్లు మరోవైపు భారత జట్టుకు అండగా నిలబడనున్నారని తెలిపారు. టీమిండియాకు ప్రపంచ కప్ అందించగల సత్తా భారత బౌలర్లకు వుందని సచిన్ ప్రశంసించారు. 

కాబట్టి గతంలో ప్రపంచ కప్ ఆడిన బౌలర్లతో ప్రస్తుతం బౌలర్లను పోల్చడం ఆపాలని సూచించారు. అయినా అప్పటికి ఇప్పటికి  క్రికెట్లో, నిబంధనల్లో, ఆటతీరులో చాలా మార్పులు వచ్చాయని గుర్తుచేశారు. 2003 ప్రపంచ కప్ లో శ్రీనాథ్, జహీర్ ఖాన్, నెహ్రా, హర్భజన్ సింగ్‌లు, 2011లో జహీర్‌ఖాన్‌, నెహ్రా, హర్భజన్‌, మునాఫ్‌ పటేల్‌, యువరాజ్‌ సింగ్‌‌లు కీలక పాత్ర పోషించారని  గుర్తుచేశారు. అలాగే ఈసారి  కూడా బుమ్రా, భువనేశ్వర్, షమీ, కుల్దీప్, చాహల్ లు అద్భుత ప్రదర్శనతో టీమిండియాకు ప్రపంచ కప్ ట్రోపీ సాధించిపెట్టగలరన్న నమ్మకం వుందని సచిన్ వెల్లడించారు.  

click me!