పాక్ గెలుపుపై సానియా ట్వీట్: 16న కూడా చేయాలంటున్న నెటిజన్లు

Siva Kodati |  
Published : Jun 05, 2019, 11:51 AM IST
పాక్ గెలుపుపై సానియా ట్వీట్: 16న కూడా చేయాలంటున్న నెటిజన్లు

సారాంశం

రెండో మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను మట్టికరిపించడంతో జట్టుపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో భారత టెన్నిస్ సంచలనం సానియా మీర్జా పాక్ జట్టుకు అభినందనలు తెలిపారు

ప్రపంచకప్‌లో భాగంగా హాట్ ఫేవరేట్ ఇంగ్లాండ్‌పై పాకిస్తాన్ సంచలన విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్ చేతిలో ఘోరంగా ఓడిపోయిన పాకిస్తాన్‌..రెండో మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను మట్టికరిపించడంతో జట్టుపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఈ క్రమంలో భారత టెన్నిస్ సంచలనం సానియా మీర్జా పాక్ జట్టుకు అభినందనలు తెలిపారు. పాకిస్తాన్ జట్టుకు అభినందనలు.. ఓ మ్యాచ్‌లో ఘోరంగా ఓడిపోయిన అనంతరం పుంజుకుని గెలుపు బాట పట్టడం అద్భుతం.. పాకిస్తాన్ అంచనాలకు అందదని ఎందుకు అంటారో మరోసారి రుజువైంది.

పాక్ గెలుపు బాట పట్టడంతో వరల్డ్ కప్ మరింత ఆసక్తిగా మారుతుందనడంలో సందేహం లేదు అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు సానియా స్పందనపై పాక్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తుండగా.. భారత అభిమానులు మండిపడుతున్నారు.

జూన్ 16న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఫలితంపై కూడా ట్వీట్ చేయాలి. ఎందుకంటే ఆ మ్యాచ్‌లో పాక్‌పై కోహ్లీ సేన గెలుస్తుంది...భారత్‌ను పొగుడుతూ ట్వీట్ చేయడం మరచిపోకు అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ప్రపంచకప్‌లో భాగంగా జూన్ 16న దాయాదుల పోరు జరగనుంది. వరల్డ్ కప్‌లో పాక్‌పై టీమిండియా ఇప్పటి వరకు ఓడిపోలేదు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం ఇరు దేశాల మధ్య జరుగుతున్న మ్యాచ్ కావడంతో ఇరు దేశాల్లోనూ ఆసక్తి  నెలకొంది. 

PREV
click me!

Recommended Stories

రాయుడిని కాదని మయాంక్ ను ఎందుకు ఎంపిక చేశామంటే: ఎమ్మెస్కే ప్రసాద్
ప్రపంచ కప్ ఓటమి ఎఫెక్ట్: శ్రీలంక జట్టులో ప్రక్షాళన షురూ...ముందుగా వారిపైనే వేటు...?