ఇండో పాక్ మ్యాచ్: పాక్ అభిమానులు సర్ఫరాజ్ ను ఎలా తిట్టారంటే... ఎదురుగానే (వీడియో)

By Arun Kumar PFirst Published Jun 19, 2019, 7:19 PM IST
Highlights

ప్రపంచ కప్ టొర్నీలో భాగంగా దాయాది దేశాలైన ఇండియా-పాకిస్థాన్  జట్ల మధ్య గత ఆదివారం మాంచెస్టర్ లో మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఇరు దేశాల అభిమానులే  కాదు క్రికెట్ అంటే ఇష్టపడే ప్రతి ఒక్కరు ఈ మ్యాచ్ కోసం ఎదురుచూశారు. అయితే ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ మ్యాచ్ లో పాక్ టీమిండియాకు కనీస పోటీని  కూడా ఇవ్వకుండానే మొదట బౌలింగ్, ఫీల్డింగ్ ఆ తర్వాత బ్యాటింగ్ లోనూ విఫలమై ఓటమిపాలయ్యింది. దీంతో పాక్ అభిమానులే కాదు మాజీలు, విశ్లేషలకులతో  పాటు క్రికెట్ అంటే తెలియని సామాన్యులు కూడా ఆ జట్టును  తీవ్రంగా దూషిస్తున్నారు. 

అయితే ఇలా అందరు మ్యాచ్ ముగిసిన తర్వాత పాక్ ఆటగాళ్లను విమర్శిస్తున్నారు. కానీ ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వెళ్లిన పాక్ అభిమానులు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగానే కెప్టెన్ సర్పరాజ్ పై దూషనకు దిగారు. అతడి శరీర ఆకృతిని గురించి చాలా అసభ్యంగా అరుస్తూ మైదానంలోనే సర్పరాజ్ ను ఘోరంగా  అవమానించారు. 

టాస్ అనంతరం ఫీల్డింగ్ ఎంచుకున్న అతడు కోచ్ మిక్కి ఆర్థర్ తో మాట్లాడుతూ బౌండరీకి దగ్గర్లో నిలబడ్డాడు. ఈ సమయంలో కొందరు అభిమానులు '' ఓయ్ మోఠే (లావుగా వున్నాడని) నీవు మా జట్టుకు కెప్టెన్ ఎలా అయ్యావు. ఇంత కొవ్వెక్కిన నిన్ను ఎలా సారథిగా ఎంపికచేశారు. నీకు ఫిట్ నెస్ మాత్రమే కాదు బుర్ర కూడా లేదని  నిరూపించుకున్నావ్. బ్యాటింగ్ కు అనుకూలించే పిచ్ పై బౌలింగ్ ఎంచుకుంటావా? మన దేశ ప్రధాని(ఇమ్రాన్ ఖాన్) మాట వినవా?  '' అంటూ ఉర్ధూలో సర్ఫరాజ్ కు వినపడేలా దూషించారు. 

ఆ మాటలలను విని వాని వైపు చూసినప్పటికి  ఏం చేయలేని పరిస్థితుల్లో అతడున్నాడు. దీంతో కొందరు ఈ వీడియయోను సోషల్ మీడియాలో పెట్టడం...అదికాస్తా వైరల్ అవడం వెంటవెంటనే జరిగిపోయింది. నిజంగా తప్పు చేశాడు కాబట్టే అతడు అభిమానులను ఏం అనలేక పోయాడని నెటిజన్లు సర్ఫరాజ్ నే తప్పుబడుతూ కామెంట్స్ చేస్తున్నారు.

Another Vedio Pakistani fans scolding Sarfaraz after the match pic.twitter.com/76nEGbrEod

— South Kashmir (@southKashmir24)

click me!