ఐసిసి ప్రపంచ కప్: చిత్తుచిత్తుగా ఓడిన పాక్... విండీస్ ఘన విజయం

By Arun Kumar PFirst Published May 31, 2019, 2:46 PM IST
Highlights

ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా జరిగిన రెండో మ్యాచ్ లో విండీస్ అద్భుత  విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రత్యర్ధి పాకిస్థాన్  కనీస పోరాటపటిమ ప్రదర్శించలేక చతికిల పడింది. 106 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన విండీస్ కేవలం 13.4 ఓవర్లలోని( 218 బంతులు మిగిలుండగానే) లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని అందుకుంది. 

ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా జరిగిన రెండో మ్యాచ్ లో విండీస్ అద్భుత  విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రత్యర్ధి పాకిస్థాన్  కనీస పోరాటపటిమ ప్రదర్శించలేక చతికిల పడింది. 106 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన విండీస్ కు గేల్ చక్కటి  శుభారంభాన్నిచ్చాడు. అతడు బౌండరీలతో చెలరేగి  ఆడుతూ కేవలం 34 బంతుల్లో 50 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే అతడు ఔటైన తర్వాత పూరన్ (19 బంతుల్లో 34 పరుగులు) ధాటిగా ఆడి లాంఛనాన్ని పూర్తి చేశాడు. వీరిద్దరు చెలరేగడంతో కేవలం 13.4 ఓవర్లలోని( 218 బంతులు మిగిలుండగానే) విండీస్ పాక్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని అందుకుంది. 

అంతకు ముందు మొదట బ్యాటింగ్ కు దిగిన పాక్ చెత్త ప్రదర్శన కనబర్చచింది. వెస్టీండిస్ బౌలర్ల విజృంభణతో పాక్ బ్యాట్ మెన్స్ చేతులెత్తేశారు. దీంతో కేవలం 105 పరుగులకే ఆ జట్టు కుప్పకూలింది. పాక్ ఏ దశలోనూ విండీస్ బౌలర్లను ఎదుర్కొని పరుగులు రాబట్టలేకపోయింది. దీంతో వరుసగా వికెట్లు కోల్పోయి ప్రపంచ కప్ ను పేలవంగా ఆరంభించింది. 

విండీస్ బౌలర్లు పాక్ బ్యాటింగ్ లైనప్ ని  కోలుకోనివ్వలేదు. థామస్ 4, హోల్డర్ 3, రస్సెల్స్ 2, కోట్రెల్ ఒక వికెట్ పడగొట్టి పాక్ నడ్డి విరిచారు. రస్సెల్ అయితే 3 ఓవర్లలో కేవలం  నాలుగు పరుగులు మాత్రమే రెండు కీలక వికెట్లను పడగొట్టాడు.  

విండీస్ బౌలర్ హోల్డర్ తన బౌలింగ్ తో మాయ చేశాడు. అతడు ఒకే ఓవర్లో కెప్టెన్ సర్పరాజ్ అహ్మద్, ఇమద్ వసీమ్ వికెెట్లతో  పాటు హసన్ అలీల వికెట్లు పడగొట్టాడు. మరో బౌలర్ థామస్ పాక్ లోయర్ ఆర్డర్ ని కకావికలం చేసి ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు.  

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పాక్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది.విండీస్ బౌలర్ కాట్రెల్ వేసిన మూడో ఓవర్లో పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ హోప్స్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.ఆ తర్వాత పాక్ వికెట్ల పతనం కొనసాగింది. 

ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా జరుగుతున్న రెండో మ్యాచ్ లో శుక్రవారం పాకిస్తాన్- వెస్టిండిస్ జట్లు తలపడ్డాయి. నాటింగ్ హామ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో విండీస్ టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో పాక్ మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. 

టాస్ గెలిస్తే తాము కూడా ఫీల్డింగ్ ఎంచుకునే వారిమని పాక్ కెప్టెన్ సర్పరాజ్ అన్నారు. అయినా ఏం పరవాలేదని పిచ్  బ్యాటింగ్ కు సహకరించేలా వుందన్నాడు. తమ జట్టుకు మంచి బ్యాటింగ్ లైనప్ వుందని, ఈ టోర్నీకి ముందే వారంతా మంచి ఫామ్ ను అందిపుచ్చకున్నారని పాక్ కెప్టెన్ వెల్లడించాడు.  బౌలర్లు ఆమీర్, వాహబ్ ల అనుభవం తమకెంతో ఉపయోగపడుతుందని సర్పరాజ్ అన్నారు.  

తుది జట్లు;

పాకిస్తాన్:

ఇమామ్ ఉల్ హక్,  ఫకార్ జమాన్, బాబర్ ఆజమ్, హరీస్ సోహైల్, సర్ఫరాజ్ అహ్మద్ (కెప్టెన్, వికెట్ కీపర్), మహ్మద్ హఫీజ్, ఇమద్ వసీమ్, షాదన్ ఖాన్, మమ్మద్ అమీర్, హసన్ అలీ, వాహబ్ రియాజ్

విండీస్ టీం:

క్రిస్ గేల్, హోప్(వికెట్ కీపర్), డారెన్ బ్రావో, హెట్మెయర్, నికోలస్ పూరన్, ఆండీ రస్సెల్, జాసన్ హోల్డర్(కెప్టెన్), బ్రాత్ వెట్, నర్స్, కోట్రెల్, థామస్  

click me!