ప్రపంచ కప్ 2019: ఇంగ్లాండ్ ఆరంభం అదుర్స్... బ్యాటింగ్ లో అరుదైన రికార్డ్

By Arun Kumar PFirst Published May 30, 2019, 7:12 PM IST
Highlights

 ప్రపంచ కప్ ఆరంభ మ్యాచ్ లో ఇంగ్లాండ్ బ్యాట్ మెన్స్ అరుదైన ఘనత సాధించారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఆరంభ మ్యాచ్ లో ఇంగ్లీష్ బ్యాట్ మెన్స్ అందరూ సమిష్టిగా రాణించారు. ఈ మ్యాచ్ లో మొత్తం నలుగురు ఆటగాళ్లు అర్థశతకాలతో ఆకట్టుకున్నారు. ఇలా ప్రపంచ కప్ మ్యాచ్ లో నలుగురు ఇంగ్లాండ్ బ్యాట్ మెన్స్ హాఫ్ సెంచరీలతో ఆకట్టుకోవడం ఇదే మొదటిసారి. సమిష్టిగా రాణిస్తున్న ఇంగ్లాండ్ జట్టు ఈ  అరుదైన ఘనత సాధించింది. 

ఇంగ్లాండ్ ఓపెనర్ బెయిర్ స్టో మొదటి ఓవర్లోనే డకౌటైనప్పటికి జేసన్ రాయ్ సమయోచితంగా ఆడుతూ ఇంగ్లాండ్ కు మంచి శుభారంభాన్నిచ్చాడు. అతడు జోరూట్ తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడుతూ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ  క్రమంలోనే వీరిద్దరు హాఫ్ సెంచరీలను నమోదు చేసుకున్నారు. రాయ్ 53 బంతుల్లో 54, రూట్ 59 బంతుల్లో 51 పరుగులు చేశారు. 

ఆ  తర్వాత కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కూడా తన కెప్టెన్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. అతడు 60 బంతుల్లో 57 పరుగులు చేశాడు. ఇక బెన్  స్టోక్స్ కూడా 79 బంతుల్లో 89  పరుగులు చేసి  ఇంగ్లాండ్ కు 311 పరుగుల భారీ స్కోరును అందించారు. 

ఇలా ఇంగ్లాండ్ బ్యాట్ మెన్స్ హాఫ్ సెంచరీల మోతతో భారీ పరుగులే కాదు ఇంగ్లాండ్  ఖాతాలో ఓ అరుదైన ఘనత చేరింది. ఇప్పటివరకు ప్రపంచ కప్ మ్యాచ్ లో   ఇంగ్లాండ్ బ్యాట్ మెన్స్ నలుగురు హాఫ్ సెంచరీలు చేయడం ఇదే  మొదటిసారి.  ఇలా స్వదేశంలో జరుగుతున్న మొదటి మ్యాచ్ లోనే ఇంగ్లాండ్ ఈ ఘనత సాధించడం  విశేషం.  

click me!