ఐసిసి ప్రపంచ కప్: మలింగ, డిసిల్వా బౌలింగ్ మాయాజాలం... ఇంగ్లాండ్ పై శ్రీలంక అద్భుత విజయం

By Arun Kumar PFirst Published Jun 21, 2019, 2:48 PM IST
Highlights

ప్రపంచ కప్ 2019 లో మరో సంచలనం నమోదయ్యింది. ఈ  మెగా టోర్నీలో హాట్ ఫేవరెట్ గా బరిలోకి  దిగిన ఆతిథ్య ఇంగ్లాండ్ ను శ్రీలంక మట్టికరిపించిది. గత మ్యాచ్ లో అలవోకగా 380 పైచిలుకు పరుగులు చేసిన జట్టును శ్రీలంక బౌలర్లు  కేవలం 212 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో 20 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ఓటమిని చవిచూసింది. ఉపఖండం జట్లలో పాక్ ఇదివరకే ఇంగ్లాండ్ ను  ఓడించగా ఇప్పుడు శ్రీలంక ఆ పని చేసింది. 

ప్రపంచ కప్ 2019 లో మరో సంచలనం నమోదయ్యింది. ఈ  మెగా టోర్నీలో హాట్ ఫేవరెట్ గా బరిలోకి  దిగిన ఆతిథ్య ఇంగ్లాండ్ ను శ్రీలంక మట్టికరిపించిది. గత మ్యాచ్ లో అలవోకగా 380 పైచిలుకు పరుగులు చేసిన జట్టును శ్రీలంక బౌలర్లు  కేవలం 212 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో 20 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ఓటమిని చవిచూసింది. ఉపఖండం జట్లలో పాక్ ఇదివరకే ఇంగ్లాండ్ ను  ఓడించగా ఇప్పుడు శ్రీలంక ఆ పని చేసింది. 

233 పరుగుల స్వల్ఫ  లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లీష్ జట్టును విరామం లేకుండా దెబ్బతీస్తూ మొదట మలింగ్ టాప్ ఆర్డర్ ను కుప్పకూల్చాడు. ఓపెన్రర్్ బెయిర్ స్టో ను మొదటి ఓవర్లోనే డకౌట్ చేసిన  మలింగ్ ఆ వెంటనే మరో ఓపెనర్ విన్స్(14 పరుగులు) ను పెవిలియన్ కు పంపించాడు. ఆ తర్వాత రూట్ (57 పరుగులు), బట్లర్ (10 పరుగులు) లు కూడా మలింగ చేతికే చిక్కారు. మధ్యలో కెప్టెన్ మోర్గాన్ ను ఉదానా(21 పరుగులు) ఔట్ చేయడంతో టాప్ ఆర్డర్ మొత్తం  కుప్పకూలింది. 

ఇలా మలింగ నాలుగు వికెట్లతో ఆతిథ్య జట్టు టాప్ ఆర్డర్ ను కుప్పకూలిస్తే మిడిల్, లోయర్ ఆర్డన్ బ్యాట్ మెన్స్ ను ఔట్ చేసే భాద్యత డిసిల్వా తీసుకున్నాడు. మోయిన అలీ (16 పరుగులు), వోక్స్ (2 పరుగులు),రషీద్ (1 పరుగు) లను ఔట్ చేసి ఇంగ్లాండ్ ను దాదాపు ఓటమి అంచుల్లోకి నెట్టాడు. ఆ తర్వాత ఆర్చర్(3 పరుగులు) ను ఉదానా ఔట్ చేయగా చివరి  వికెట్ రూపంలో మార్క వుడ్ ప్రదీప్ బౌలింగ్ లో ఔటయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ 212 పరుగులకే ఆలౌటవడంతో శ్రీలంక 20 పరుగుల తేడాతో విజయాన్ని  అందుకుంది. స్టోక్స్ ఒక్కడే చివరి  అజేయంగా నిలిచి 82 పరుగులు చేసినా ఫలితం లేకుండా పోయింది. 

అంతకు ముందు శ్రీలంక బ్యాట్ మెన్స్ తడబడటంతో తక్కువ పరుగులకే పరిమితమవ్వాల్సి వచ్చింది. ఆతిథ్య ఇంగ్లాండ్ పై మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంకకు ఆదిలోనే షాక్ తగిలింది. కేవలం 3 పరుగుల వద్దే ఓపెనర్లిద్దరు వికెట్లు సమర్పించుకున్నారు. అయితే మిగతా బ్యాట్ మెన్స్ పరిస్థితులకు తగ్గట్లుగా సమయోచితంగా ఆడటంతో లంక 233 పరుగుల లక్ష్యమయినా ఇంగ్లాండ్ ముందు వుంచగలిగింది. 

లంక బ్యాట్ మెన్స్ లో మాథ్యూస్ 85 పరుగులతో ఆకట్టుకున్నాడు. అలాగే ఫెర్నాండో 49, మెండిస్ 46, డిసిల్వా 29 పరుగులతో పరవాలేదనిపించారు. టాప్ ఆర్డర్ పోరాడినా లోయర్ ఆర్డర్ టపటపా వికెట్లు కోల్పోవడంతో శ్రీలంక మరికొన్ని పరుగులు సాధించే అవకాశాన్ని కోల్పోయింది. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆర్చర్ 3, మార్క్ వుడ్ 3, రషీద్ 2, వోక్స్ 1 వికెట్లు పడగొట్టాడు. 

 స్వదేశంలో జరుగుతున్న ప్రపంచ కప్ లో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగి వరుస విజయాలతో దూసుకుపోతున్న ఇంగ్లాండ్ కు శ్రీలంక షాకిచ్చింది. లీడ్స్ వేదికన జరిగిన మ్యాచ్ ను   గెలుచుకుని సెమీస్ బెర్తును ఖాయం చేసుకోవాలన్న ఆతిథ్య జట్టు  కోరిక తీరలేదు. అయితే సెమీస్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్ లో లంక సత్తా చాటింది.  

 తుది జట్లు:

ఇంగ్లాండ్ టీం:

జోని బెయిర్ స్టో, జేమ్స్ విన్స్, జో రూట్,  ఇయార్ మోర్గాన్ (కెప్టెన్), బెన్ స్టోక్, జాస్ బట్లర్(వికెట్ కీపర్), మోయిన్ అలీ, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్

శ్రీలంక టీం:

దిముత్ కరుణరత్నే(కెప్టెన్), కుషాల్ పెరీరా(వికెట్ కీపర్), అవిష్కా ఫెర్నాండో, కుషాల్ మెండిస్, ఆంజెలో మాథ్యూస్, జీవన్ మెండిస్, ధనంజయ  డిసిల్వా, థిసార పెరీరా, ఇసురు ఉదాన, లసిత్ మలింగ, నువాన్ ప్రధీప్

సంబంధిత వార్తలు

2019 వరల్డ్ కప్ లో భారత్ తలపడే మ్యాచుల షెడ్యూల్  

click me!