ఐసిసి ప్రపంచ కప్: అప్ఘాన్ పై ఆసిస్ ఘన విజయం... అర్థశతకాలతో అదరగొట్టిన వార్నర్, ఫించ్

By Arun Kumar PFirst Published Jun 1, 2019, 5:58 PM IST
Highlights

బ్రిస్టాల్ వేదికగా జరిగిన ప్రపంచ కప్ లీగ్ మ్యాచ్ లో అప్ఘానిస్తాన్ పై ఆసిస్ ఆధిపత్యం కొనసాగింది.  తక్కువ పరుగులకే (207) అప్ఘాన్ ను కట్టడి చేసిన ఆసిస్ ఛేదనలోనూ అదరగొట్టింది. ఓపెనర్లు ఫించ్, వార్నర్ లు హాఫ్ సెంచరీలతో ఆకట్టుకోవడంతో ఆసిస్ కేవలం 34.5 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేధించింది. ఇలా ప్రపంచ  కప్ 12 సీజన్ ను ఆస్ట్రేలియా ఘనమైన విజయంతో ఆరంభించింది.

బ్రిస్టాల్ వేదికగా జరిగిన ప్రపంచ కప్ లీగ్ మ్యాచ్ లో అప్ఘానిస్తాన్ పై ఆసిస్ ఆధిపత్యం కొనసాగింది.  తక్కువ పరుగులకే (207) అప్ఘాన్ ను కట్టడి చేసిన ఆసిస్ ఛేదనలోనూ అదరగొట్టింది. ఓపెనర్లు ఫించ్, వార్నర్ లు హాఫ్ సెంచరీలతో ఆకట్టుకోవడంతో ఆసిస్ కేవలం 34.5 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేధించింది. ఇలా ప్రపంచ  కప్ 12 సీజన్ ను ఆస్ట్రేలియా ఘనమైన విజయంతో ఆరంభించింది.

ఆసిస్ కెప్టెన్ ఫించ్ దాటిగా ఆడి 49 బంతుల్లో 66 పరుగులు చేసి అప్ఘాన్ కెప్టెన్ నయిబ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. అతడి స్థానంలో బరిలోకి దిగిన ఖవాజా కేవలం 15 పరుగులు మాత్రమే చేేసి అప్ఘాన్ స్పిన్ మాంత్రికుడు రషీద్ ఖాన్ బౌలింగ్ లో పెవిలియన్ కు చేరాడు. అయినప్పటికి మరో  ఆసిస్ ఓపెనర్ వార్నర్ సంయమనంతో మరో వికెట్ పడకుండానే 89 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అప్ఘాన్ బౌలర్లలో కెప్టెన్ నయిబ్, రషీద్ ఖాన్, మజీబ్ ఉర్ రహ్మాన్ తలో వికెట్ పడగొట్టారు.   

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పసికూన అఫ్ఘాన్ బలమైన ఆస్ట్రేలియాపై ఫరవాలేదనిపించింది. మొదట బ్యాటింగ్ కు దిగి ఆసిస్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్న అప్ఘాన్ బ్యాట్ మెన్స్ సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. అహ్మద్ షా (43 పరుగులు), కెప్టెన్ గుల్బదిన్ నయిబ్  (31 పరుగులు), జద్రాన్  (51 పరుగులు) ఆకట్టుకున్నారు. దీంతో అప్ఘాన్ 207 పరుగుల గౌరవప్రదమైన స్కోరును  అందుకున్నారు. 

అప్ఘాన్ ఇన్నింగ్స్ మధ్యలో కాస్త నెమ్మదించినా ఆస్ట్రేలియా బౌలర్లు చివర్లో మళ్లీ సత్తాచాటారు. అప్ఘాన్ కెప్టెన్ నయిబ్, జద్రాన్ నిలకడగా ఆడుతూ కాస్సేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నా ఒకే ఓవర్లో స్టోయినీస్ వీరిద్దరి వికెట్లు తీయడంతో మరోసారి కష్టాల్లో పడింది. ఇలా ఆస్ట్రేలియా బౌలర్ల దాటికి అప్ఘాన్ బ్యాట్ మెన్స్ విలవిల్లాడిపోయారు.  

ఐసిసి ప్రపంచ కప్ లో భాగంగా ఇవాళ(శనివారం) పసికూన అప్ఘాన్ తో ఆస్ట్రేలియా తలపడింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన అఫ్ఘాన్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఆస్ట్రేలియా మొదట బౌలింగ్ కు దిగినా మంచిి ఫలితాన్నే రాబట్టింది.

వార్మప్ మ్యాచ్ సందర్భంగా పటిష్టమైన పాకిస్తాన్ పై అప్ఘాన్  అనూహ్య విజయాన్ని అందుకుంది. దీంతో ఒక్కసారిగా అందరి చూపు అప్ఘాన్ పై పడింది. ఈ జట్టుకు తనదైన రోజు సంచలనాలను సృష్టించగల సత్తా వుందని...అందుకు పాక్ పై విజయమే ఉదాహరణ అని క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం. ప్రపంచ కప్ లోనూ ఆ జట్టు సంచలనాలను సృష్టించగలదంటూ వారు అభిప్రాయపడుతున్నారు. అయితే అలాంటి సంచలనాలేవీ ఈ మ్యాచ్ లో నమోదు కాలేవు. 

తుది జట్లు:

ఆసిస్ టీం;

ఆరోన్ పించ్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్ వెల్, స్టోయినీస్, అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), కుమిన్స్, నాథన్ కుల్టెర్ నైల్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా
 
అప్ఘాన్ టీం:

మహ్మద్ షజాద్, హజ్రతుల్లా, రహమత్ షా, హష్మతుల్లా షహిదీ, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, గుల్బదిన్ (కెప్టెన్), రషీద్ ఖాన్, ముజీబ్ రహ్మాన్, హమీద్ హసన్, దవ్లత్ జద్రాన్

click me!