ఇండియాపై మ్యాచ్: పాక్ బౌలర్ కు అంపైర్ రెండుసార్లు వార్నింగ్

By telugu teamFirst Published Jun 17, 2019, 7:58 AM IST
Highlights

మొదట మూడో ఓవర్‌ మూడో బంతి విసిరిన తర్వాత ఆమిర్‌ పిచ్‌పై పరిగెత్తాడు. దాంతో అంపైర్‌ బ్రూస్‌ ఆక్పెన్‌ఫర్డ్‌ను వార్నింగ్‌ ఇచ్చాడు.  పాకిస్థాన్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అంపైర్‌ వద్దకు వచ్చి..ఆమిర్‌ మళ్లీ అలా చేయడని చెప్పాడు.

మాంచెస్టర్: ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచులో పాకిస్తాన్ బౌలర్ మొహమ్మద్ అమీర్ ను రెండుసార్లు అంపైర్ హెచ్చరించాడు. బంతి వేసిన తర్వాత రెండుసార్లు పిచ్ పై పరుగెత్తడంతో ఆ హెచ్చరికలు జారీ చేశాడు.

మొదట మూడో ఓవర్‌ మూడో బంతి విసిరిన తర్వాత ఆమిర్‌ పిచ్‌పై పరిగెత్తాడు. దాంతో అంపైర్‌ బ్రూస్‌ ఆక్పెన్‌ఫర్డ్‌ను వార్నింగ్‌ ఇచ్చాడు.  పాకిస్థాన్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అంపైర్‌ వద్దకు వచ్చి..ఆమిర్‌ మళ్లీ అలా చేయడని చెప్పాడు.

అయితే, అంపైర్‌ హెచ్చరికను ఏమాత్రం పట్టించుకోని ఆమిర్‌ ఐదో ఓవర్లో మరోసారీ అలాగే పిచ్‌పై పరిగెత్తాడు. దాంతో ఆగ్రహించిన ఆక్సెన్‌ఫర్డ్‌..ఆమిర్‌ను రెండోసారి హెచ్చరించాడు. అంపైర్‌ హెచ్చరికలను అమీర్ సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించలేదు. ఆ రెండుసార్లు నవ్వు తూ కనిపించాడు.

కాగా, మూడోసారి అంపైర్‌ వార్నింగ్‌ ఇచ్చివుంటే ఇన్నింగ్స్‌లో మళ్లీ బౌలింగ్‌ చేసేందుకు ఆమిర్‌ కు వీలయ్యేది కాదు. అనర్హుడయ్యేవాడు. ఇదిలావుంటే, 24వ ఓవర్‌లో వాహబ్‌ రియాజ్‌ను కూడా రెండుసార్లు అంపైర్లు హెచ్చరించారు.

click me!