
మాంచెస్టర్: భారత్ తో జరుగుతున్న పాకిస్తాన్ మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ 46వ ఓవర్‌లో భారత ఆటగాళ్లు బ్యాటింగ్ చేస్తుండగా వర్షం పడింజది. దీంతో మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది.
వర్షం కారణంగా మైదానంలోని ఆటగాళ్లంతా డ్రెస్సింగ్ రూమ్స్‌కు వెళ్లిపోయారు. దాదాపు అరగంట తర్వాత మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. ఈ సమయంలో తిరిగి కీపింగ్ చేసేందుకు వచ్చిన పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ నిద్ర ముంచుకొస్తున్నట్లు ఆవలించాడు.
దానిపై భారత క్రికెట్ అభిమానులు సర్ఫరాజ్‌పై సోషల్ మీడియాలో హాస్యస్ఫోరకమైన వ్యాఖ్యలు చేశారు.