స్టోయినిస్ రన్నవుట్: ఫించ్ అసహనం, ఫ్యాన్స్ ఆగ్రహం

By telugu teamFirst Published Jun 25, 2019, 10:15 PM IST
Highlights

నాన్‌స్ట్రైక్‌లో ఉన్న స్టీవ్‌ స్మిత్‌ సంకేతాలను ఏ మాత్రం ఖాతరు చేయకుండా స్టోయినిస్ తొందరపడ్డాడని, లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్‌ అయ్యాడని విమర్శిస్తున్నారు. ఆ సమయంలో బ్యాటింగ్‌ చేస్తున్న స్మిత్‌తో పాటు డగౌట్‌లో ఉన్న సారథి ఆరోన్‌ ఫించ్‌ కూడా స్టొయినిస్‌ తీరుపై అసహనం వ్యక్తం చేశారు.

లండన్‌: ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో మంగళవారం జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ స్టొయినిస్‌ రనౌట్‌ అయిన తీరుపై ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. జట్టుకు అవసరమైన సమయంలో అనవసరంగా రనౌటయ్యాడని సోషల్‌మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

నాన్‌స్ట్రైక్‌లో ఉన్న స్టీవ్‌ స్మిత్‌ సంకేతాలను ఏ మాత్రం ఖాతరు చేయకుండా స్టోయినిస్ తొందరపడ్డాడని, లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్‌ అయ్యాడని విమర్శిస్తున్నారు. ఆ సమయంలో బ్యాటింగ్‌ చేస్తున్న స్మిత్‌తో పాటు డగౌట్‌లో ఉన్న సారథి ఆరోన్‌ ఫించ్‌ కూడా స్టొయినిస్‌ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. 

ఆసీస్‌ ఇన్నింగ్స్‌ సందర్భంగా అదిల్‌ రషీద్‌ వేసిన 42వ ఓవర్‌ ఐదో బంతిని స్టీవ్‌ స్మిత్‌ లాంగాఫ్‌ వైపు కొట్టి సింగిల్‌ తీసే ప్రయత్నం చేశాడు. అయితే మరో ఎండ్‌లో ఉన్న స్టొయినిస్‌ లేని రెండో పరుగు కోసం పరిగెత్తాడు. కానీ స్మిత్‌ రెండో పరుగుపై ఆసక్తి ప్రదర్శించకుండా క్రీజుకు దగ్గరలోనే ఆగిపోయాడు. 

అయితే పరుగు పందెంలో పాల్గొన్న ఆటగాడిగా పరిగెత్తుకుంటూ స్టోయినిస్ రెండో ఎండ్‌కు చేరుకున్నాడు.అప్పటికే బెయిర్‌ స్టో బంతిని అందుకొని కీపర్‌ బట్లర్‌కు అందించడంతో స్టొయినిస్‌ అవుటయ్యాడు. 

click me!