ఐసిసి ప్రపంచ కప్: రికార్డు సృష్టించిన ఫించ్

Published : Jun 25, 2019, 10:00 PM IST
ఐసిసి ప్రపంచ కప్: రికార్డు సృష్టించిన ఫించ్

సారాంశం

ఈ ప్రపంచకప్‌ పోటీల్లో ఫించ్‌కు ఇది రెండో సెంచరీ.  ఫలితంగా వరల్డ్‌కప్‌లో రెండు సెంచరీలు సాధించిన రెండో ఆసీస్ కెప్టెన్‌గా ఫించ్ రికార్డులకెక్కాడు. 

లండన్: ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం ఇంగ్లాండుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆసీస్ కెప్టెన్ అరోన్ ఫించ్ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 116 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో ఫించ్ సెంచరీ చేశాడు. సరిగ్గా 100 పరుగులు చేసి అవుటయ్యాడు. 

ఈ ప్రపంచకప్‌ పోటీల్లో ఫించ్‌కు ఇది రెండో సెంచరీ.  ఫలితంగా వరల్డ్‌కప్‌లో రెండు సెంచరీలు సాధించిన రెండో ఆసీస్ కెప్టెన్‌గా ఫించ్ రికార్డులకెక్కాడు. 2003లో అప్పటి కెప్టెన్ రికీ పాంటింగ్ రెండు సెంచరీలు చేశాడు. ప్రస్తుతం రికార్డును ఫించ్ సమం చేశాడు. 

ఈ నెల 15న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఫించ్ 153 పరుగులు చేశాడు. ఫించ్‌కు ఇది మొత్తంగా వన్డేల్లో 15వ సెంచరీ.

PREV
click me!

Recommended Stories

'సూపర్' విశ్వవిజేత ఇంగ్లాండు: న్యూజిలాండ్ ఆశలు గల్లంతు
మేం ఫైనల్‌కు వెళ్లడమే పెద్ద విషయం: మోర్గాన్ ఆసక్తికర వ్యాఖ్యలు