ఐసిసి ప్రపంచ కప్: ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన షకిబ్...అప్ఘాన్ పై బంగ్లా ఘన విజయం

By Arun Kumar PFirst Published Jun 24, 2019, 3:05 PM IST
Highlights

ప్రపంచ కప్ టోర్నీలో బంగ్లాదేశ్ మరో అద్భుత విజయాన్ని అందుకుంది. పసికూన అప్ఘానిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో బంగ్లా మొదట బ్యాటింగ్ ఆ తర్వాత బౌలింగ్, ఫీల్డింగ్ లొో అదరగొట్టి గెలుపొందింది. దీంతో ఆ జట్టు సెమీస్ ఆశలు మరింత మెరుగయ్యాయి.  

ప్రపంచ కప్ టోర్నీలో బంగ్లాదేశ్ మరో అద్భుత విజయాన్ని అందుకుంది. పసికూన అప్ఘానిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో బంగ్లా మొదట బ్యాటింగ్ ఆ తర్వాత బౌలింగ్, ఫీల్డింగ్ లొో అదరగొట్టి గెలుపొందింది. దీంతో ఆ జట్టు సెమీస్ ఆశలు మరింత మెరుగయ్యాయి.  

263 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్ఘాన్ కు ఓపెనర్లు శుభారంభాన్నిచ్చారు. గుల్బదిన్ నయిబ్(47 పరుగులు), రహ్మత్ షా( 24 పరుగులు) లు మంచి  భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే  వీరు ఔటైన తర్వాత టపటపా  వికెట్లు కోల్పోడంతో అప్ఘాన్ కష్టాల్లో  పడింది.  అయితే చివరి ఓవర్లలో సమీవుల్లా( 44 పరుగులు) ఒక్కడే నాటౌట్ గా  నిలిచి పోరాడినా ఫలితంలేకుండా పోయింది. అతడికి సహకరించేవారు లేకపోవడంతో అఫ్ఘాన్ కేవలం 47 ఓవర్లలోనే 200 పరుగులకే ఆలౌటయ్యింది. దీంతో బంగ్లా 62 పరుగుల తేడాతో ఘన  విజయం సాధించింది.  

అంతకు ముందు  బంగ్లా బ్యాటింగ్ కూడా ఇలాగే  సాగింది. ఆరంభం నుండి అద్భుతంగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ చివరి ఓవర్లలో తడబడింది. భారీ పరుగులు సాధిస్తుందనుకున్న ఆ జట్టును అప్ఘాన్ బౌలర్లు కేవలం 262 పరుగులకే కట్టడి చేశారు. నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టపోయి బంగ్లా ఈ పరుగులు చేసింది. 

బంగ్లా బ్యాట్ మెన్స్ లో ముష్ఫికర్ రహీమ్ అద్భుతంగా ఆడి 87  బంతుల్లో 83 పరుగులు చేశాడు. అంతేకాకుండా ముష్పికర్ రహీమ్(52 పరుగులు) హాఫ్ సెంచరీతో, మొసద్దిక్ హుస్సెన్ 35, తమీమ్ ఇక్బాల్ 36 పరుగులతో రాణించారు. అఫ్ఘాన్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రహ్మాన్ 3, గుల్బదిన్ నయిబ్ 2, నబి, దవ్లత్ లు ఒక్కో వికెట్ పడగొట్టారు.  

 ఓ వైపు వికెట్లు పడుతున్నా ఒత్తిడికి లోనవకుండా సంయమనంతో బ్యాటింగ్ చేస్తున్న ముష్ఫికర్ రహీమ్ హాఫ్ సెంచరీ సాధించాడు. కేవలం  56  బంతుల్లోనే అతడు తన అర్థశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అయితే అంతకముందు బంగ్లాదేశ్ మంచి స్కోరు దిశగా సాగుతున్న సమయంలో వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లోకి జారుకుంది. హాఫ్ సెంచరీ(51 పరుగులు)ఆకట్టుకున్న షకీబుల్ హసన్ ను రహ్మాన్ ఔట్ చేశాడు. ఆ తర్వాత సౌమ్య సర్కార్(3 పరుగులు)  కూడా రహ్మాన్ బౌలింగ్ లోనే పెవిలియన్ కు చేరాడు. దీంతో బంగ్లా 151 పరుగుల వద్ద నాలుగో వికెట్లు కోల్పోయింది.   

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బంగ్లాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. అప్ఘాన్ బౌలర్ రహ్మాన్ బౌలింగ్ లో ఓపెనర్ లిటన్ దాస్(16 పరుగులు) ఔటయ్యాడు. దీంతో బంగ్లా 23 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత మరో ఓపెనర్ వికెట్ ను కూడా కోల్పోయింది. తమీమ్ ఇక్బాల్(36 పరుగులు)ను మహ్మద్ నబీ అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించి క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో బంగ్లా 82 పరుగుల వద్ద  రెండో వికెట్ కోల్పోయింది.  

ప్రపంచ కప్ లో సంచలన విజయాలతో దూసుకుపోతున్న బంగ్లాదేశ్ మరో సమరానికి సిద్దమైంది. అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ జట్లుగా పేరున్న వెస్టిండిస్, సౌతాఫ్రికా వంటి  జట్లను మట్టికరిపించిన బంగ్లా పసికూన అప్ఘాన్ తో తలపడి విజయాన్ని సాధించింది.ఇలా మూడు విజయాలు, ఓ డ్రాతో ఏడు పాయింట్లు సాధించి  సెమీస్ ఆశలు సజీవంగా వుంచుకుంది.   

 ఇరుజట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన ఈ మ్యాచ్ సౌతాంప్టన్ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్ కోసం నిర్వహించిన టాస్ ను అప్గాన్ గెలుచుకుంది. దీంతో కెప్టెన్ నయిబ్ ఫీల్డింగ్ వైపు మొగ్గుచూపాడు. కాబట్టి బంగ్లా మొదట బ్యాటింగ్ చేసింది.   

ఈ మ్యాచ్ కోసం బంగ్లాదేశ్ జట్టు రెండు మార్పులు చేపట్టింది. రుబెల్ హుస్సెన్, షబ్బీర్ రహ్మాన్ స్థానంలో మొసద్దిక్ హుస్సెన్, మహ్మద్ సైఫుద్దిన్ లు జట్టులో చేరినట్లు మోర్తజా వెల్లడించాడు.  అప్ఘాన్  టీంలో కూడా రెండు మార్పులు చోటుచేసుకున్నట్లు  కెప్టెన్ నయిబ్ తెలిపాడు. హజ్రతుల్లా జజాయి, అఫ్తాబ్ ఆలం స్థానంలో దవ్లత్ జద్రాన్, సమీవుల్లా లు జట్టేలోకి వచ్చినట్లు నయబ్ వెల్లడించాడు. 

  

click me!