జింబాబ్వే జోరుకి యూఎస్‌ఏ బేజారు! వన్డేల్లో రికార్డు స్కోరు కొట్టి, 304 పరుగుల తేడాతో చిత్తు చేసి...

Published : Jun 27, 2023, 01:13 PM IST
జింబాబ్వే జోరుకి యూఎస్‌ఏ బేజారు! వన్డేల్లో రికార్డు స్కోరు కొట్టి, 304 పరుగుల తేడాతో చిత్తు చేసి...

సారాంశం

యూఎస్‌ఏతో మ్యాచ్‌లో 408 పరుగుల భారీ స్కోరు నమోదు చేసిన జింబాబ్వే... 304 పరుగుల తేడాతో గెలిచి, వన్డేల్లో రికార్డు విజయం.. 

ఐసీసీ వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ 2023‌లో జింబాబ్వే వరుస విజయాలతో దూసుకుపోతోంది. గ్రూప్ Aలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 35 పరుగుల తేడాతో గెలిచి, హ్యాట్రిక్ విజయాలతో సూపర్ 6 రౌండ్‌కి అర్హత సాధించిన జింబాబ్వే, యూఎస్‌ఏతో జరిగిన ఆఖరి గ్రూప్ మ్యాచ్‌లో 304 పరుగుల తేడాతో సంచలన విజయం అందుకుంది..

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 408 పరుగుల భారీ స్కోరు చేసింది. జింబాబ్వేకి వన్డేల్లో ఇదే అత్యధిక స్కోరు. జింబాబ్వే ఓపెనర్ ఇన్నోసెంట్ కియా 32 పరుగులు చేయగా జోలార్డ్ గుంబీ 78 పరుగులు చేశాడు..

కెప్టెన్ సీన్ విలియమ్స్ 101 బంతుల్లో 21 ఫోర్లు, 5 సిక్సర్లతో 174 పరుగులు చేసి భారీ సెంచరీ నమోదు చేసుకున్నాడు. సికందర్ రజా 27 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 48 పరుగులు చేయగా రియాన్ బర్ల్ 16 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 47 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు.. 

409 పరుగుల భారీ లక్ష్యఛేదనలో యునైటెడ్ స్టేట్స్ 25.1 ఓవర్లలో 104 పరుగులకే ఆలౌట్ అయ్యింది. గజానంద్ సింగ్ 13 పరుగులు చేయగా అభిషేక్ పరద్కర్ 24 పరుగులు, జస్‌దీప్ సింగ్ 21 పరుగులు చేశారు. మిగిలిన బ్యాటర్లు ఎవ్వరూ సింగిల్ డిజిట్ స్కోరు కూడా దాటలేకపోయారు..

యునైటెడ్ స్టేట్స్ ఇన్నింగ్స్‌లో ముగ్గురు డకౌట్ కాగా ముగ్గురు బ్యాటర్లు రనౌట్ కావడం విశేషం. సికందర్ రజాకి 2 వికెట్లు దక్కాగా రిచర్డ్ గరావా 2, బ్రాడ్ ఇవన్స్, లూక్, రియాన్ బర్ల్ తలా ఓ వికెట్ తీశారు. వన్డే క్రికెట్ చరిత్రలో ఇది రెండో అతి పెద్ద విజయం. 

2023లో తిరువనంతపురంలో జరిగిన వన్డేలో టీమిండియా 317 పరుగుల తేడాతో భారీ విజయం అందుుకని టాప్‌లో ఉండగా 304 పరుగుల తేడాతో యుఎస్‌ఏని ఓడించిన జింబాబ్వే రెండో స్థానంలో నిలిచింది.. ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్‌లో జింబాబ్వేకి ఇది వరుసగా నాలుగో విజయం..

నేడు స్కాట్లాండ్ vs శ్రీలంక, యూఏఈ vs ఐర్లాండ్ మధ్య జరిగే మ్యాచ్‌తో గ్రూప్ మ్యాచులు ముగుస్తాయి. జూన్ 29 నుంచి సూపర్ 6 రౌండ్ మొదలవుతుంది. గ్రూప్ A నుంచి జింబాబ్వేతో పాటు వెస్టిండీస్, నెదర్లాండ్స్ సూపర్ 6 రౌండ్‌కి అర్హత సాధించగా గ్రూప్ B నుంచి శ్రీలంక, స్కాట్లాండ్, ఓమన్... సూపర్ 6 రౌండ్‌కి దూసుకెళ్లాయి.

సూపర్ 6 రౌండ్‌లో టాప్ 2లో నిలిచిన జట్ల మధ్య జూలై 9న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. 

PREV
click me!

Recommended Stories

IND vs SA : జైస్వాల్ తొలి సెంచరీ.. విశాఖలో సౌతాఫ్రికా చిత్తు
Rohit Sharma: వైజాగ్ వన్డేలో రోహిత్ చరిత్ర.. 20 వేల పరుగుల క్లబ్‌లో మనోడి మాస్ ఎంట్రీ !