ఆ ఇండియన్ బిజినెస్‌మ్యాన్, మ్యాచ్ ఫిక్సింగ్ చేయమని బెదిరించాడు... జింబాబ్వే మాజీ క్రికెటర్ వ్యాఖ్యలు...

By Chinthakindhi RamuFirst Published Jan 24, 2022, 4:03 PM IST
Highlights

జింబాబ్వే మాజీ క్రికెటర్ బ్రెండన్ టేలర్, ఓ సంచలన విషయాన్ని బయటపెట్టాడు.17 అంతర్జాతీయ సెంచరీలు చేసి  జింబాబ్వే తరుపున అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పిన ఈ మాజీ కెప్టెన్, గత ఏడాది సెప్టెంబర్‌లో రిటైర్మెంట్ ప్రకటించాడు...

జింబాబ్వే మాజీ క్రికెటర్ బ్రెండన్ టేలర్, ఓ సంచలన విషయాన్ని బయటపెట్టాడు.17 అంతర్జాతీయ సెంచరీలు చేసి  జింబాబ్వే తరుపున అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పిన ఈ మాజీ కెప్టెన్, గత ఏడాది సెప్టెంబర్‌లో రిటైర్మెంట్ ప్రకటించాడు...

2019లో ఓ భారత వ్యాపారవేత్త, తనను మ్యాచ్ ఫిక్సింగ్ చేయమని బెదిరించినట్టు, అతని నుంచి కొంత నగదు కూడా తీసుకున్నట్టుగా సోషల్ మీడియా ద్వారా స్టేట్‌మెంట్ విడుదల చేశాడు బ్రెండన్ టేలర్...

‘రెండేళ్లుగా నేను ఈ భారాన్ని మోస్తున్నా... దీని కారణంగా కొన్ని రోజులు చీకట్లో కూడా బతకాల్సి వచ్చింది. నా మానసిక ఆరోగ్యంపై కూడా బాగా ప్రభావం చూపించింది...
నేను ఇండియాకి వచ్చిన తర్వాత ఓ నైట్‌ అవుట్‌కి వెళ్లా. అక్కడ ఎవరో నాకు కొకైన్ ఆఫర్ చేశారు. నేను కాదనలేకపోయాను. ఇప్పుడు నిర్భయంగా ఈ విషయాన్ని  నా క్లోజ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో పంచుకోవడం మొదలెట్టాను...
2019 అక్టోబర్‌లో ఇండియాకి ఓ స్పాన్సర్‌షిప్ గురించి మాట్లాడడానికి వచ్చాను. జింబాబ్వేలో ఓ టీ20 కాంపీటిషన్ లాంఛ్ చేయాలనే ఆలోచనతో ఉన్నాం... అప్పటికే జింబాబ్వే క్రికెట్ బోర్డు నుంచి మాకు ఆరు నెలలుగా జీతాలు లేవు...
చాలా ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయి ఉన్నాం. అలాంటి సమయంలో ఇండియాకి వెళ్లి వస్తే రూ.15 వేల డాలర్లు (దాదాపు 11 లక్షలు) ఇస్తామని చెప్పారు. దాంతో కాదనలేక వచ్చాను...
ఆ రాత్రి తర్వాత ఓ బిజినెస్‌మ్యాన్, అతని మనుషులు నన్ను కలవడానికి వచ్చారు. నేను కొకైన్ తాగుతున్న దృశ్యాలను చూపించి, మ్యాచ్ ఫిక్సింగ్ చేయకపోతే, ఆ వీడియోను మీడియాకి ఇస్తామని బెదిరించాడు...

ఆ తర్వాతి రోజు అతను నా హోటల్ రూమ్‌కి కూడా వచ్చాడు. అతనితో పాటు మరో ఆరుగురు ఉన్నారు. వాళ్లంతా నా చుట్టూ నిలబడ్డారు. నాకు భయమేసింది, నన్ను చంపేస్తారేమోనని అనిపించింది... ఏం చేయాలో తెలియక వాళ్లు చెప్పినదానికి అంగీకరించాను. అది నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. స్వదేశానికి వచ్చిన తర్వాత ఆ సంఘటనను మరిచిపోలేకపోయా. మానసికంగా, శారీరకంగా చాలా కృంగిపోయా...

ఆ వ్యాపారవేత్త తరుచూ ఫోన్ చేసేవాడు. మ్యాచ్ ఫిక్సింగ్ చేయకపోతే తన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని హెచ్చరించేవాడు. ఈ విషయాన్ని ఐసీసీకి చెప్పడానికి నాకు నాలుగు నెలల సమయం పట్టింది... ఇప్పుడు ఈ విషయాన్ని బయటపెట్టడం వల్ల ఐసీసీ నాపైన నిషేధం విధించవచ్చు.

అయితే నాకు జరిగిన విషయం, కొత్త క్రికెటర్లకు జాగ్రత్త పడడానికి పనికి వస్తుంది... నా కుటుంబం, నా స్నేహితులు, మరీ ముఖ్యంగా నన్ను నేను మోసం చేసుకుంటూ ఉండలేను... విలువలతో బతకాలనేదే నా ఉద్దేశం...’ అంటూ సుదీర్ఘ స్టేట్‌మెంట్ విడుదల చేశాడు బ్రెండన్ టేలర్...

జింబాబ్వే తరుపున 34 టెస్టులు, 205 వన్డేలు, 45 టీ20 మ్యాచులు ఆడిన బ్రెండన్ టేలర్, టెస్టుల్లో 6 సెంచరీలు, వన్డేల్లో 11 సెంచరీలు చేశాడు.. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున 2014 సీజన్ ఆడాడు బ్రెండన్ టేలర్..

click me!