జింబాబ్వేలో నీటి కొరత.. బాత్‌రూముల్లో జలకాలాటలు వద్దన్న బీసీసీఐ.. రాహుల్ అండ్ కో‌ కు కీలక సూచన

Published : Aug 16, 2022, 12:22 PM IST
జింబాబ్వేలో నీటి కొరత.. బాత్‌రూముల్లో జలకాలాటలు వద్దన్న బీసీసీఐ.. రాహుల్ అండ్ కో‌ కు కీలక సూచన

సారాంశం

IND vs ZIM: సుమారు ఆరేండ్ల తర్వాత జింబాబ్వే పర్యటనకు వెళ్లింది టీమిండియా. అక్కడ జింబాబ్వేతో మూడు వన్డేలు ఆడనుంది.  కానీ  ప్రస్తుతం ఆ దేశం తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కుంటున్నది.   

జింబాబ్వే పర్యటనలో ఉన్న భారత క్రికెటర్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక ఆదేశాలు జారీ చేసింది. బాత్‌రూముల్లో గంటలకు గంటలు ఉంటూ నీటిని వృథా చేయవద్దంటూ కీలక సూచన చేసింది. ఐదు నిమిషాల్లో  స్నానం ముగించుకుని రావాలని, నీటిని కాపాడాలని సూచించింది.   జింబాబ్వేలో ప్రస్తుతం నీటి కొరత తీవ్రంగా ఉంది. ముఖ్యంగా  వన్డే సిరీస్ జరగాల్సి ఉన్న  ఆ దేశ రాజధాని హరారేలో వారానికి  ఒకసారి మాత్రమే తాగునీరు వస్తుండటంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. 

ఈ నేపథ్యంలో  బీసీసీఐ అక్కడ ఉన్న భారత క్రికెటర్లకు కీలక సూచన చేసింది. ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘అవును. జింబాబ్వేలో  నీటి కొరత ఉంది. వన్డే సిరీస్ జరగాల్సి ఉన్న హరారేలో  ప్రజలు నీటి కోసం ఇక్కట్లు పడుతున్నారని తెలుస్తున్నది.. 

దీంతో మేం క్రికెటర్లందరూ నీటిని జాగ్రత్తగా వాడానలి సూచించాం.  తక్కువ సమయంలోనే  స్నానాలను  పూర్తి చేసుకోవాలని క్రికెటర్లకు చెప్పాం.  నీటి కొరత కారణంగా స్విమ్మింగ్  పూల్స్ లో జలకాలాటలు వంటివి అన్ని రద్దు చేశాం..’ అని  తెలిపాడు . 

కరువు ఛాయలతో కొట్టుమిట్టాడుతున్న జింబాబ్వేలో  ప్రతి ఏడాదీ ఈ సీజన్ లో నీటి కొరత సర్వసాధారణం.  2019 లో అయితే అక్కడి ప్రజలకు తాగునీరు లేక కలుషితమైన నీటినే తాగాల్సి వచ్చినట్టు గతంలో వార్తలు వచ్చాయి.  ఈసారి కూడా నీటిని శుద్ది చేసే యంత్రాలు పాడవడంతో ప్రజలు తాగునీటికి ఇక్కట్లు పడుతున్నారు. 

 

టీమిండియాకు విదేశీ పర్యటనలలో ఇలా నీటి కొరత ఎదురువడం ఇదే ప్రథమం కాదు. గతంలో 2018లో భారత జట్టు దక్షిణాఫ్రికాకు వెళ్లినప్పుడూ ఇదే పరిస్థితి తలెత్తింది. కానీ అప్పుడు ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకొచ్చి  క్రికెటర్ల అవసరాలను తీర్చారు. అయితే ఇప్పటికే జింబాబ్వే చేరుకున్న టీమిండియా క్రికెటర్లు.. తాము  ప్రజల నీటి కొరతను చూశామని, సర్దుబాటు అలవాటు చేసుకుంటున్నామని చెప్పాడు. 

ఇదే విషయమై జట్టులో సభ్యుడిగా ఉన్న  ఓ క్రికెటర్ స్పందిస్తూ.. ‘గతంలో భారత జట్టు దక్షిణాఫ్రికాకు వెళ్లినప్పుడు  అక్కడ నీటి కొరత ఉందని  వినడమే తప్ప నేను ప్రత్యక్షంగా చూడలేదు. కానీ ఇప్పుడది వాస్తవం. నేను కళ్లారా చూస్తున్నా. దీంతో మేం తక్కువ నీటినే వాడుతున్నాం.  ఇక్కడ పిచ్ లు కూడా డ్రైగా ఉన్నాయి. వాటికి పట్టడానికి కూడా నీళ్లు లేవు.  మేం ఇక్కడ సర్దుబాటు అలవాటు చేసుకున్నాం..’ అని తెలిపాడు. 

 

PREV
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !