ఎంఎస్ ధోనీకి నివాళిగా ఆ పాత వీడియో పోస్టు చేసిన ఐసీసీ... రోహిత్ శర్మ కామెంట్లతో మొదలెట్టి...

By Chinthakindhi RamuFirst Published Aug 15, 2022, 6:30 PM IST
Highlights

ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్‌కి రెండేళ్లు... మాహీకి స్పెషల్ వీడియోతో ఐసీసీ ట్రిబ్యూట్... పాత వీడియోనేనా అంటూ మాహీ ఫ్యాన్స్ అసంతృప్తి...

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ... భారత క్రికెట్‌పైనే కాదు, ప్రపంచ క్రికెట్‌పైనే చెరగని ముద్ర వేశాడు. ఆడమ్ గిల్‌క్రిస్ట్ తర్వాత వికెట్ కీపింగ్‌కి బీభత్సమైన క్రేజ్ తీసుకొచ్చిన మాహీ, హెలికాఫ్టర్ షాట్ వంటి కొత్త కొత్త షాట్స్‌ని పరిచయం చేశాడు. కెప్టెన్‌గా అద్భుత విజయాలు అందుకున్న మహేంద్ర సింగ్ ధోనీ, అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి సరిగ్గా రెండేళ్లు దాటింది...

మాహీ రిటైర్మెంట్‌కి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఓ పాత వీడియోను రీపోస్ట్ చేసింది అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ). ఐపీఎల్ 2020 సీజన్ ఆరంభానికి ముందు ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు మాహీ. ఆ తర్వాత రోజున ఎంఎస్ ధోనీకి నివాళిగా ఓ స్పెషల్ వీడియోను పోస్టు చేసింది ఐసీసీ...

“... from 1929 hrs consider me as Retired.” in 2020, India superstar bid goodbye to international cricket.

A tribute to the legend 📽️

— ICC (@ICC)

Latest Videos

‘భారత క్రికెట్ చరిత్రలో మహేంద్ర సింగ్ ధోనీ, అత్యంత ప్రభావవంతమైన క్రికెటర్లలో ఒకడు..’ అంటూ రోహిత్ శర్మ చేసిన కామెంట్లతో ఈ వీడియో ప్రారంభమవుతుంది. 2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ సమయంలో టీమిండియాని ముందుండి నడిపిస్తున్న మూమెంట్‌తో పాటు 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ సమయాల్లో మాహీ ఫీలింగ్స్‌ని ఈ వీడియోలో చూపించింది ఐసీసీ...

‘నేను ఆడిన కెప్టెన్లలో ధోనీ ది బెస్ట్ కెప్టెన్’ అంటూ సచిన్ టెండూల్కర్ చేసిన కామెంట్‌తో పాటు 2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో మిస్బా వుల్ హక్, శ్రీశాంత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అవ్వడం... భారత జట్టు చేసుకున్న విన్నింగ్ సెలబ్రేషన్స్... ఈ వీడియోలో కనిపించాయి...

‘ఆఖరి 6 బంతుల్లో 15 పరుగులు కావాల్సి ఉంటే... క్రీజులో ఎంఎస్ ధోనీ ఉంటే ప్రెషర్ బౌలర్ పైనే ఉంటుంది. ధోనీపైన కాదు’ అంటూ ఇయాన్ బిషప్ చేసిన కామెంట్లతో పాటు ధోనీ కొట్టిన భారీ సిక్సర్లు, ఆసియా కప్‌ ఫైనల్‌లో మాహీ చేసిన రనౌట్‌తో బంగ్లాదేశ్‌ని ఓడించి భారత జట్టు టైటిల్ గెలవడం వంటి మూమెంట్స్‌ ఈ వీడియోలో ఉన్నాయి...

మహేంద్ర సింగ్ ధోనీ వికెట్ కీపింగ్ స్కిల్స్, టీమిండియా ఫ్యాన్స్ సెలబ్రేషన్స్‌ని జోడించి... ‘ఎంఎస్ ధోనీ ఈజ్ ఏ హీరో’ అంటూ కపిల్ దేవ్ చేసిన కామెంట్లను జత చేసింది ఐసీసీ... 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ని ఎంఎస్ ధోనీ హెలికాఫ్టర్ షాట్ సిక్సర్‌తో ముగించడం... దానికి రవిశాస్త్రి చెప్పిన కామెంటరీ.. ఇలా ధోనీ కెరీర్‌లో బెస్ట్ మూమెంట్స్‌ని ఏరికోరి వీడియోలో కూర్చింది ఐసీసీ...

‘ఫుల్‌స్టాప్ వచ్చే వరకూ వ్యాఖ్యం ముగిసినట్టు కాదు... ’ అంటూ ఎంఎస్ ధోనీ కొటేషన్‌ని ఆఖర్లో పెట్టి... ‘ధోనీ... ధోనీ...’ అంటూ ప్రేక్షకులు చేసే హర్షధ్వానాలను హైలైట్ చేసింది.. అయితే మాహీకి ట్రిబ్యూట్ ఇవ్వడానికి కొత్త వీడియో చేయడానికి కూడా ఐసీసీ దగ్గర సమయం లేదా? మళ్లీ పాత వీడియోనే పోస్ట్ చేయాలా? అని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కొందరు ఫ్యాన్స్...

click me!