టీమిండియా గ్రూప్-2లో ఎవరెవరితో తలపడనుంది..? మ్యాచ్‌లు ఎక్కడ..? షెడ్యూల్ వివరాలు ఇవే..

Published : Oct 21, 2022, 06:08 PM IST
టీమిండియా గ్రూప్-2లో ఎవరెవరితో తలపడనుంది..? మ్యాచ్‌లు ఎక్కడ..? షెడ్యూల్ వివరాలు ఇవే..

సారాంశం

T20 World Cup 2022: పదిహేనేండ్ల తర్వాత  టీ20 ప్రపంచకప్ ను మళ్లీ భారత్ కు తీసుకురావాలనే లక్ష్యంతో ఆస్ట్రేలియాకు బయల్దేరిన  టీమిండియా.. ఆ మేరకు ఆదివారం తొలి  అడుగు వేసేందుకు సిద్ధమవుతున్నది.  క్వాలిఫై రౌండ్  మ్యాచ్ లు ముగిశాక భారత్  ఏ జట్టుతో పోటీ పడనుందో స్పష్టత వచ్చింది. 

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20  ప్రపంచకప్ లో క్వాలిఫై కథ ముగిసింది. శనివారం నుంచి అసలు సిసలు సూపర్ - 12 మొదలుకానుంది. క్వాలిఫై రౌండ్ లో  8 జట్లు పోటీ పడగా  అందులోంచి శ్రీలంక, నెదర్లాండ్స్, జింబాబ్వే,  ఐర్లాండ్ లు సూపర్-12కు అర్హత సాధిచాయి.  ఈ నేపథ్యంలో భారత్ షెడ్యూల్ ఎలా ఉంది..?  ఈనెల 23 తర్వాత భారత్.. ఏ జట్లతో పోటీ పడనుంది..? తదితర వివరాలు ఇక్కడ చూద్దాం.  

టీమిండియా ఈనెల 23న పాకిస్తాన్  తో  మ్యాచ్ ద్వారా ఈ ప్రపంచకప్ వేటను  మొదలుపెట్టనుంది.  మెల్‌బోర్న్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది.  ఇప్పటికే ఇరు జట్లు మెల్‌బోర్న్‌కు చేరి ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాయి.  

టీమిండియా షెడ్యూల్, వేదిక, టైమ్ : 

- అక్టోబర్ 23 : ఇండియా - పాకిస్తాన్ 
వేదిక : మెల్‌బోర్న్,  భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 

- అక్టోబర్ 27 : ఇండియా - నెదర్లాండ్స్ 
వేదిక : సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, మ్యాచ్ టైం :  మధ్యాహ్నం 12.30 నుంచి 

- అక్టోబర్ 30 : ఇండియా - సౌతాఫ్రికా
వేదిక : పెర్త్ స్టేడియం. మ్యాచ్ టైం : సాయంత్రం 4.30 నుంచి 

- నవంబర్ 02 : ఇండియా - బంగ్లాదేశ్ 
వేదిక : అడిలైడ్ ఓవల్. మ్యాచ్ టైం : మధ్యాహ్నం 1:30 నుంచి 

- నవంబర్ 06 : ఇండియా - జింబాబ్వే 
వేదిక : మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్. మ్యాచ్ టైం : మధ్యాహ్నం 1.30 నుంచి..

 

భారత్ తో సహా టీ20 ప్రపంచకప్‌కు సంబంధించిన మ్యాచ్ లన్నీ స్టార్ నెట్వర్క్ తో పాటు డిస్నీ హాట్ స్టార్ లో వీక్షించొచ్చు. 

గ్రూప్ : బిలో ఉన్న జట్లు :  ఇండియా, పాకిస్తాన్,  సౌతాఫ్రికా, నెదర్లాండ్స్, జింబాబ్వే, బంగ్లాదేశ్ 

- సూపర్ - 12లో భాగంగా రెండు గ్రూపుల నుంచి టాప్ 2 గా నిలిచిన రెండు జట్లు సెమీస్‌కు చేరతాయి.  నవంబర్ 9న తొలి సెమీస్ (సిడ్నీ), నవంబర్ 10న రెండో సెమీస్ (అడిలైడ్) జరుగనుండగా.. నవంబర్ 13న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా ఫైనల్ జరుగుతుంది. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

India : షెఫాలీ వర్మ విధ్వంసం.. శ్రీలంక బేజారు! రెండో టీ20 టీమిండియాదే
5 Wickets in 1 Over : W W W W W... ఒకే ఓవర్‌లో 5 వికెట్లు.. అంతర్జాతీయ క్రికెట్ లో కొత్త చరిత్ర