టెస్టు సిరీస్‌కి ముందు ఇంగ్లాండ్‌కి ఎదురుదెబ్బ... గాయంతో ఓపెనర్ జాక్ క్రావ్లీ దూరం...

By team teluguFirst Published Feb 4, 2021, 12:43 PM IST
Highlights

డ్రెస్సింగ్ రూమ్‌లో జారిపడిన ఇంగ్లాండ్ ఓపెనర్  జాక్ క్రావ్లీ...

మొదటి రెండు టెస్టులకు దూరం...

జాక్ క్రావ్లీ స్థానంలో జానీ బెయిర్‌స్టో తుదిజట్టులో చోటు దక్కించుకునే అవకాశం...

ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి అర్హత సాధించడానికి కీలకంగా మారిన టెస్టు సిరీస్‌కి ముందు ఇంగ్లాండ్‌కి ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లాండ్ ఓపెనర్ జాక్ క్రావ్లీ... మట్టికట్టు గాయం కారణంగా మొదటి రెండు టెస్టులకు దూరమయ్యాడు. ప్రస్తుతం చెన్నైలో నెట్‌ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంటున్న జాక్ క్రావ్లీ... డ్రెస్సింగ్ రూమ్‌లో జారిపడ్డాడు. ఈ సంఘటనతో క్రావ్లీ మణికట్టుకి గాయమైంది.

గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో రెండు వారాల విశ్రాంతి అవసరమని సూచించారు వైద్యులు. దీంతో మొదటి రెండు టెస్టులకు జాక్ క్రావ్లీ దూరం కానున్నాడు. అతని స్థానంలో జానీ బెయిర్‌స్టో తిరిగి తుది జట్టులో స్థానం సంపాదించుకునే అవకాశం ఉంది. శ్రీలంక పర్యటనలో రెండు టెస్టుల్లో విఫలమయ్యాడు జాక్ క్రావ్లీ.

నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 35 పరుగులు మాత్రమే చేసిన జాక్ క్రావ్లీ, నాలుగుసార్లు లంక స్పిన్నర్ ఎంబ్లుదియా బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు. జాక్ క్రావ్లీతో పోలిస్తే జానీ బెయిర్‌స్టోకి ఇండియాపై, స్పిన్ బౌలింగ్‌లో మంచి రికార్డు ఉంది.

Zak Crawley has been ruled out of the first two Tests with a wrist injury he sustained after slipping in the dressing room.

Who should replace him in the XI? pic.twitter.com/F9IW8OTlF6

— ICC (@ICC)

 

click me!