ఓ ఇంటివాడైన మరో ఇండియన్ క్రికెటర్..!

By telugu news teamFirst Published Feb 4, 2021, 7:31 AM IST
Highlights

రిన్నీ వృత్తి రీత్యా న్యాయవాది. ఈ సందర్భంగా రిన్నీతో కలిసి దిగిన ఫోటోతో పాటు ఓ లేఖను ట్విట్టర్ ద్వార పోస్ట్ చేసి తన పెళ్ళి విషయాన్ని ఉనాద్కత్ అభిమానులతో పంచుకున్నాడు.
 

భారత క్రికెటర్ జయదేవ్ ఉనాద్కత్ మంగళవారం సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, కొంతమంది స్నేహితుల సమక్షంలో రిన్నీ కంటారియాను ఉనాద్కత్ పెళ్లాడాడు. రిన్నీ వృత్తి రీత్యా న్యాయవాది. ఈ సందర్భంగా రిన్నీతో కలిసి దిగిన ఫోటోతో పాటు ఓ లేఖను ట్విట్టర్ ద్వార పోస్ట్ చేసి తన పెళ్ళి విషయాన్ని ఉనాద్కత్ అభిమానులతో పంచుకున్నాడు.

అయితే మా వివాహం ఫిబ్రవరి 2న కుటుంబం మరియు స్నేహితుల సమక్షంలో జరిగిందని, ఈ విషయాన్ని మీతో పంచుకోవడం మాకు చాలా సంతోషంగా ఉందని, మాపై మీరు చూపించిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు అంటూ మేం ప్రారంభించిన ఈ అద్భుతమైన కొత్త ప్రయాణానికి మీ ఆశీర్వాదం కావాలని ఉనాద్కత్ లేఖలో పేర్కొన్నారు. 

‘ 2021 ఫిబ్రవరి 2న మా పెళ్లి జరిగింది. కుటుంబసభ్యులు, మిత్రులు, సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకున్నాం. మా పై మీరు చూపించిన ప్రేమకు ధన్యవాదాలు. మేం సరికొత్త జీవితం ఆరంభిస్తున్న నేపథ్యంలో మీ ఆశీర్వాదం కోరుకుంటున్నాం. మీ రిన్నీ, జయదేవ్’ అంటూ జయదేవ్ ఉనద్కత్ ట్వీట్ చేయడం విశేషం.

జయదేవ్, రిన్నీది పెద్దలు కుదిర్చిన పెళ్లి. పెళ్లి కి ముందు సంగీత్ వేడుక ఘనంగా జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లెఫ్ట్‌ఆర్మ్ మీడియం ఫేసర్ అయిన ఉనాద్కత్ భారత్ తరఫున టెస్టు, వన్డే, టీ20 మూడు ఫార్మాట్లలో ఆడాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌ తరపున ఆడుతున్నాడు.


 

click me!