తర్వాతి బంతికి ఏమైందో నీకు తెలుసు... హార్దిక్ కి జహీర్ ఖాన్ గట్టి కౌంటర్

Published : Oct 09, 2019, 11:36 AM ISTUpdated : Oct 09, 2019, 12:00 PM IST
తర్వాతి బంతికి ఏమైందో నీకు తెలుసు... హార్దిక్ కి జహీర్ ఖాన్ గట్టి కౌంటర్

సారాంశం

ఓ దేశవాళీ క్రికెట్ సందర్భంగా జహీర్ ఖాన్ బౌలింగ్ లోతాను సిక్స్ కొట్టిన వీడియోని షేర్ చేశాడు. ఇది చూసి నెటిజన్లు హార్దిక్ పై తీవ్రంగా మండిపడుతున్నారు. దీంతో సీనియర్‌ ఆటగాడికి నువ్విచ్చే గౌరవం ఇదేనా అంటూ నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. హార్దిక్‌ అహంకారానికి ఇదే నిదర్శమంటూ ఘాటు కామెంట్లతో విమర్శిస్తున్నారు.

టీం ఇండియా ఆల్ రౌండర్ కి  మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీలో ఇరుక్కోవడం హార్దిక్ పాండ్యాకి అలవాటే. తాజాగా... క్రికెటర్ జహీర్ ఖాన్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ వ్యంగ్యంగా పోస్టు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ పోస్టుకి జహీర్ ఖాన్ స్పందించి.., తనదైన రీతిలో కౌంటర్ ఇచ్చాడు.

ఇంతకీ మ్యాటరేంటంటే... ‘హ్యాపీ బర్త్ డే  జాక్.. నేనిక్కడ కొట్టినట్లు నువ్వు కూడా మైదానం బయటికి దంచి కొడతావనే ఆశిస్తున్నా’ అని పేర్కొంటూ ఓ దేశవాళీ క్రికెట్ సందర్భంగా జహీర్ ఖాన్ బౌలింగ్ లోతాను సిక్స్ కొట్టిన వీడియోని షేర్ చేశాడు. ఇది చూసి నెటిజన్లు హార్దిక్ పై తీవ్రంగా మండిపడుతున్నారు. దీంతో సీనియర్‌ ఆటగాడికి నువ్విచ్చే గౌరవం ఇదేనా అంటూ నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. హార్దిక్‌ అహంకారానికి ఇదే నిదర్శమంటూ ఘాటు కామెంట్లతో విమర్శిస్తున్నారు. 

ఈ ట్వీట్ కి జహీర్ ఖాన్ స్పందించాడు. ‘‘ ముందుగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపినందుకు హార్దిక్ కి దన్యవాదాలు. అయితే నీలా బ్యాటింగ్  నేనెప్పటికీ చేయలేను. నువ్వు నా నుంచి ఎదుర్కొన్న తర్వాతి బంతి లాగే నా పుట్టిన రోజు బాగా జరిగింది’ అంటూ జహార్ ఖాన్ కౌంటర్ ఇచ్చాడు. కాగా... హార్దిక్ కి బాగా కౌంటర్ ఇచ్చారంటూ నెటిజన్లు కామెంట్లు చేయడం విశేషం. 

ఇదిలా ఉండగా ... గత కొంతకాలంగా వెన్నునొప్పి గాయంతో బాధపడుతున్న టీమిండియా ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాకు సర్జరీ పూర్తయిన విషయం తెలిసిందే. ఇటీవల సర్జరీ నిమిత్తం లండన్‌ వెళ్లాడు. దాంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు నుంచి హార్దిక్‌కు విశ్రాంతి ఇచ్చారు. కాగా... ఇప్పుడిప్పుడే హార్దిక్ ఆ గాయం నుంచి కోలుకుంటున్నాడు.

 

 

PREV
click me!

Recommended Stories

స్నేహితుడ్ని బూట్లు అడుక్కుని ట్రయిల్స్‌కు.. ఇప్పుడు ఐపీఎల్ వేలంలో భారీ ధరకు
ఆ ప్లేయర్స్‌ను కొన్నది అందుకే.! ధోని రిటైర్మెంట్ పక్కా.. నెక్స్ట్ ఏంటంటే.?