ధోనీ రిటైర్మెంట్ పై టీమిండియా కోచ్ రవిశాస్త్రి స్పందన

By telugu teamFirst Published Oct 9, 2019, 10:30 AM IST
Highlights

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ భవిష్యత్తుపై హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. ధోనీ తిరిగి క్రికెట్ ఆడాలనుకుంటే అది ఆయన ఇష్టమని రవిశాస్త్రి అన్నాడు. ప్రపంచ కప్ పోటీల తర్వాత తాను దోనీని కలుసుకోలేదని చెప్పాడు.

పూణే: ప్రపంచ కప్ టోర్నీ నుంచి టీమిండియా వెనుదిరిగిన తర్వాత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఒక్క ఆట కూడా ఆడలేదు. వెస్టిండీస్ పర్యటనకు వెళ్లలేదు. ఆ తర్వాత ప్రస్తుతం స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న జట్టులో కూడా ఆయన లేడు. ఆ స్థితిలో ఎంఎస్ ధోనీ భవిష్యత్తుపై అభిమానులు, క్రికెట్ నిపుణులు ఆసక్తి కనబరుస్తున్నారు. 

ప్రపంచ కప్ టోర్నీ తర్వాత తాను ధోనీని కలువలేదని టీమీండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి చెప్పారు. తిరిగి క్రికెట్ ఆడాలా లేదా అనేది నిర్ణయించుకోవావల్సిందే ధోనీయేనని ఆయన అన్నారు. క్రికెట్ నుంచి తప్పుకుంటే మహా క్రికెటర్ల జాబితాలో ధోనీ చేరుతాడని ఆయన అన్నారు. 

తిరిగి క్రికెట్ ఆడాలనుకుంటే నిర్ణయించుకోవాల్సింది ధోనీయేనని అన్నారు. మొదట ధోనీ ఆడడం ప్రారంభిస్తే ఏం జరుగుతుందనేది చూడవచ్చునని అన్నాడు. వన్డే, టీ20 ప్రపంచ కప్ విజేతగా ఇండియాను నిలిపిని ధోనీ ప్రస్తుతం ఆటకు దూరమై తన పద్దతుల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ కాలం గడుపుతున్నాడు. 

ప్రపంచ కప్ పోటీల తర్వాత జరిగిన వెస్టిండీస్ పర్యటనకు ధోోనీ తనంత తానే దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత కూడా తన నిర్ణయమేమిటనేది ఆయన చెప్పలేదు. దీంతో అతను ఈ రెండు సిరీస్ లకు దూరంగానే ఉన్నాడు.

 

click me!