ENG vs IND: చాహల్ మాయ.. ఇంగ్లాండ్ తడబాటు.. వందకే ఐదు వికెట్లు

Published : Jul 14, 2022, 07:26 PM IST
ENG vs IND: చాహల్ మాయ.. ఇంగ్లాండ్ తడబాటు..  వందకే ఐదు వికెట్లు

సారాంశం

ENG vs IND 2nd ODI: లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండోవన్డేలో ఇంగ్లాండ్ తడబడుతోంది. తొలి  వన్డేలో పేసర్లు మెరిస్తే ఈ వన్డేలో స్పిన్నర్ చాహల్ తన మాయతో రెచ్చిపోతున్నాడు.  

లార్డ్స్ వన్డేలో ఇంగ్లాండ్ తడబడుతోంది.  ఇప్పటికే ఆ  జట్టు  నాలుగు కీలక వికెట్లు కోల్పోయి  కష్టాల్లోపడింది. కాస్త ఓపికగా ఆడిన ఓపెనర్లు  ఔటైన వెంటనే చాహల్ మాయతో ఇంగ్లాండ్  ను దెబ్బతీశాడు. అతడి  దాటికి దాటిగా ఆడుతున్న బెయిర్ స్టో తో పాటు   జో రూట్ కూడా వెనుదిరిగారు.  ఇక ఈ వన్డేలో అయినా ఆడతాడనుకుని ఇంగ్లాండ్ అభిమానులు  కోట్లాది ఆశలు పెట్టుకున్న కెప్టెన్ బట్లర్ కూడా అలా వచ్చి ఇలా వెళ్లాడు. ప్రస్తుతం 22 ఓవర్లు ముగిసేరికి ఇంగ్లాండ్.. 5 వికెట్ల నష్టానికి 102 పరుగులు  చేసింది. క్రీజులో లివింగ్ స్టోన్  (3 నాటౌట్), మోయిన్ అలీ (0) ఆడుతున్నారు. 

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ కు  తొలి వన్డేలో మాదిరిగానే భారత బౌలర్లు చుక్కలు చూపించారు. షమీ, బుమ్రా ల బౌలింగ్ లో ఆడటానికి  జేసన్ రాయ్ (33 బంతుల్లో 23.. 2 ఫోర్లు, 1 సిక్సర్), జానీ బెయిర్ స్టో(38 బంతుల్లో 38.. 6 ఫోర్లు)  ఇబ్బందిపడ్డారు.  

కానీ షమీ వేసిన  ఐదో ఓవర్లో ఐదోబంతికి జేసన్ రాయ్ సిక్సర్ బాది స్కోరువేగాన్ని పెంచాడు. కానీ హర్ధిక్ పాండ్యా  వేసిన 9వ ఓవర్లో రాయ్.. స్క్వేర్ లెగ్ లో ఫీల్డింగ్ చేస్తున్న సూర్యకుమార్ యాదవ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 

 

అయితే ఆ తర్వాత బెయిర్ స్టో ప్రసిధ్ కృష్ణను లక్ష్యంగా చేసుకున్నాడు. ప్రసిధ్ వేసిన  14 వ ఓవర్లో రెండుఫోర్లు బాదాడు. ప్రమాదకరంగా  పరిణమిస్తున్న  బెయిర్ స్టో ను ఆ తర్వాతి ఓవర్లో చాహల్ బౌల్డ్ చేశాడు.

ఇదే ఊపులో చాహల్.. 18వ ఓవర్లో జో రూట్ (21 బంతుల్లో 11)ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కిపంపాడు. 19వ ఓవర్లో రెండో స్పెల్ కు బౌలింగ్ కు వచ్చిన షమీ.. కెప్టెన్ జోస్ బట్లర్ (4) ను క్లీన్ బౌల్డ్ చేశాడు.   దీంతో ఇంగ్లాండ్ 87 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.  

 

ఇక చాహల్.. 22వ ఓవర్లో  బెన్ స్టోక్స్ (21.. 3 ఫోర్లు)  ను ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేసి ఇంగ్లాండ్ ను కోలుకోలేని దెబ్బతీశాడు.   ప్రస్తుతం ఆ జట్టు  సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉంది. 

PREV
click me!

Recommended Stories

IND vs SA: లక్నోలో పొగమంచు దెబ్బ.. నాలుగో టీ20 రద్దు
ICC Rankings : వరుణ్ చక్రవర్తి దెబ్బ.. బుమ్రా ఆల్ టైమ్ రికార్డు బద్దలు