ఐపీఎల్ నిరవధిక వాయిదా.. వాళ్లని మిస్ అవుతున్నానంటూ చాహల్ భార్య..!

Published : May 06, 2021, 08:10 AM ISTUpdated : May 06, 2021, 08:13 AM IST
ఐపీఎల్ నిరవధిక వాయిదా.. వాళ్లని మిస్ అవుతున్నానంటూ చాహల్ భార్య..!

సారాంశం

ఆర్సీబీ క్రికెటర్ యజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ.. సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ధనశ్రీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. 

కరోనా కారణంగా ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో... క్రికెటర్లంతా.. తమ కుటుంబసభ్యులతో కలిసి ఇళ్లకు చేరిపోయారు. మొన్నటి వరకు క్రికెటర్లు కొందరు.. తమ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి బయో బబుల్ లో ఉన్నారు. ఇప్పుడు ఐపీఎల్ వాయిదాతో.. మళ్లీ ఇంటికి వెళ్లిపోయారు.

ఈ క్రమంలో.. ఆర్సీబీ క్రికెటర్ యజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ.. సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ధనశ్రీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. ఐపీఎల్ జరుగుతున్న సమయంలోనూ తమ టీమ్ ని చీర్ చేస్తూ అప్పుడప్పుడు ఫోటోలను షేర్ చేసేది.

 

ఇప్పుడు ఐపీఎల్ ముగియడంతో తాను బయో బబుల్ టీమ్ ని బాగా మిస్ అవుతున్నానంటూ కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఆ ఫోటోల్లో చాహల్ , ధనశ్రీతో పాటు.. ఆర్సీబీ క్రికెటర్లు కూడా ఉన్నారు.  5am క్లబ్ అంటూ.. చాహల్, ఏబీ డీ విలియర్స్, గ్లెన్ మ్యాక్స్ వెల్ లతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశారు.

ఐపీఎల్ వాయిదా పడిన తర్వాత కూడా తమ అభిమాన క్రికెటర్లను ఇలా చూడటంతో అభిమానులు ఆనందపడుతున్నారు. పలువురు క్రికెటర్లు కరోనా బారిన పడటంతో.. ఐపీఎల్ ని నిరవధికంగా వాయిదా వేస్తూ.. బీసీసీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

IND vs SA : నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. తొలి టీ20లో సౌతాఫ్రికా చిత్తు
ఒరేయ్ అజామూ.! భారత్‌లో కాదు.. పాకిస్తాన్‌లోనూ కాటేరమ్మ కొడుకు క్రేజ్ చూస్తే మతిపోతోంది