ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ స్టువర్ట్ మాక్ గిల్ కిడ్నాప్..!

Published : May 05, 2021, 10:00 AM ISTUpdated : May 05, 2021, 10:12 AM IST
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ స్టువర్ట్ మాక్ గిల్ కిడ్నాప్..!

సారాంశం

మాక్ గిల్ టాలెంటెడ్ బౌలర్. ఇతను ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ ల్లో 44 మ్యాచులు ఆడాడు. చాలా సార్లు స్పిన్ బౌలింగ్ లో మాక్ గిల్ కి బెస్ట్ ర్యాంకింగ్ దక్కింది. కాగా.. దురదృష్టవశాత్తు ఆయన ఎక్కువ కాలం కెరీర్ కొనసాగించలేకపోయాడు.  

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ స్టువర్ట్ మాక్ గిల్ కిడ్నాప్ కి గురయ్యాడు. కాగా.. ఈ కేసుకు సంబంధించి ఆస్ట్రేలియన్ పోలీసులు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. సిడ్నీలో మాక్ గిల్ ని ఆయుధాలతో బెదిరించి మరీ కిడ్నాప్ చేసినట్లు పోలీసులు  చెబుతున్నారు. ఈ సంఘటన గత నెలలోనే చోటుచేసుకోగా.. నిందితులను తాజాగా అదుపులోకి తీసుకున్నారు.

మాక్ గిల్ టాలెంటెడ్ బౌలర్. ఇతను ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ ల్లో 44 మ్యాచులు ఆడాడు. చాలా సార్లు స్పిన్ బౌలింగ్ లో మాక్ గిల్ కి బెస్ట్ ర్యాంకింగ్ దక్కింది. కాగా.. దురదృష్టవశాత్తు ఆయన ఎక్కువ కాలం కెరీర్ కొనసాగించలేకపోయాడు.

గత నెల ఏప్రిల్ 14వ తేదీన మాక్ గిల్ ని ముగ్గురు వ్యక్తులు ఆయుధాలతో బెదిరించి కారులో ఎక్కించుకొని వెళ్లి కిడ్నాప్ చేశారు. నగరం నుంచి దాదాపు ఒక గంట దూరంలోని ఓ ప్రాంతానికి అతనిని తరలించినట్లు తెలుస్తోంది. మాక్ గిల్ పై దుండుగులు దాడి చేసి అనంతరం వదిలేసినట్లు తెలుస్తోంది.

కాగా.. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. తాజాగా.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

IND vs SA : నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. తొలి టీ20లో సౌతాఫ్రికా చిత్తు
ఒరేయ్ అజామూ.! భారత్‌లో కాదు.. పాకిస్తాన్‌లోనూ కాటేరమ్మ కొడుకు క్రేజ్ చూస్తే మతిపోతోంది