టీమిండియా క్రికెటర్లతో కలిసి పుష్ప డైలాగ్ అదరగొట్టిన చాహల్.. వీడియో వైరల్..!

Published : Feb 23, 2022, 10:06 AM IST
టీమిండియా క్రికెటర్లతో కలిసి పుష్ప డైలాగ్ అదరగొట్టిన చాహల్.. వీడియో వైరల్..!

సారాంశం

ఆ పాటలు, డైలాగులకు రీల్స్ చేస్తున్నారు.  ఇప్పటి వరకు సామాన్య ప్రజలు మాత్రమే వీటిపై రీల్స్ చేశారు. కాగా.. ఇప్పుడు సెలబ్రెటీలు కూడా చేస్తున్నారు. టీమిండియా క్రికెటర్లు కూడా పుష్ప డైలాగుులతో అదరగొడుతున్నారు.

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా ఎంతలా హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగుతో పాటు.. ఇతర భాషల్లోనూ ఈ సినిమాను విడుదల చేయగా.. హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాలోని  అల్లు అర్జున్ డైలాగులు, పాటలు బాగా హిట్ అయ్యాయి. ఎంతలా అంటే.. ఎక్కడ చూసినా అవే పాటలు వినపడుతున్నాయి. ఆ పాటలు, డైలాగులకు రీల్స్ చేస్తున్నారు.  ఇప్పటి వరకు సామాన్య ప్రజలు మాత్రమే వీటిపై రీల్స్ చేశారు. కాగా.. ఇప్పుడు సెలబ్రెటీలు కూడా చేస్తున్నారు. టీమిండియా క్రికెటర్లు కూడా పుష్ప డైలాగుులతో అదరగొడుతున్నారు.

టీమిండియా యువ క్రికెటర్ యజ్వేంద్ర చాహల్  ఇతర క్రికెటర్లతో కలిసి  పుష్పలోని‘ పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైరు.. తగ్గేదేలే’ డైలాగ్ ని అదరగొట్టేశారు. ఈ వీడియోని చాహల్ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా.. ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది. ఆ డైలాగు వారు హిందీలో చెప్పడం గమనార్హం.

 

కాగా... ఆయన వీడియోకి నెటిజన్లు విపరీతంగా స్పందించారు.  సూపర్ గా ఉందంటూ కామెంట్స్ చేశారు. చాలా మంది ఫైర్ సింబల్ ఎమోజీని షేర్ చేయడం విశేషం.

ఇదిలా ఉండగా..  టీమిండియా ప్రస్తుతం లక్నోలో ఉంది. వీరు.. రేపటి నుంచి శ్రీలంక తో కలిసి టీ20 సిరీస్ కోసం తలపడనున్నారు. అటల్ బిహారీ వాజ్ పేయి స్టేడియంలో.. ఈ టీ20 సిరీస్ జరగనుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !