చాహల్ టిక్ టాక్ డ్యాన్స్ వీడియో: శ్రేయస్ తో కలిసి గడ్డం స్టెప్

Published : Feb 01, 2020, 04:20 PM IST
చాహల్ టిక్ టాక్ డ్యాన్స్ వీడియో: శ్రేయస్ తో కలిసి గడ్డం స్టెప్

సారాంశం

టీమిండియా స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ ఒక్క క్రికెట్ లోనే కాదు, ఇతర కళల్లో కూడా అతను ఆరితేరాడు. తాజాగా, అతను టిక్ టాక్ వీడియో వైరల్ గా మారింది.  చాహల్ కలిసి శ్రేయస్ గడ్డం స్టెఫ్ వేశాడు.

హామిల్టన్: టీమిండియా స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ తనలోని మరో కళను వెలికి తీశాడు. అతను తాజాగా ఓ టిక్ టాక్ వీడియో చేశాడు. అందులో వచ్చే సంగీతానికి అనుగుణంగా స్టెప్పులేశాడు. శ్రేయస్ అయ్యర్ సహా మరో ఇద్దరు కూడా ఈ డ్యాన్స్ లో పాల్గొన్నారు. వారు వేసిన గడ్డం స్టెప్ అందరినీ ఆకర్షిస్తోంది. 

రాయల్ చాలెంజర్స్ తో ఆరంగేట్రం చేయడంతో చాహల్ దశ తిరిగింది. విరాట్ కోహ్లీ ఇష్టపడడంతో అనతు టీమిండియాలోకి వచ్చాడు. ప్రస్తుతం జట్టుకు ముఖ్యమైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నిాడు. 

వికెట్లు తీయడంతోనే సరిపెట్టకుండా తనలోని ఇతర కళలను కూడా వెలికి తీస్తున్నాడు. చాహల్ టీవీ పేరుతో సహచర ఆటగాళ్ల ఇంటర్వ్యూలు చేస్తున్నాడు. అతను వేసే ప్రశ్నలు నవ్వు తెప్పించడంతో ఫాలోయింగ్ బాగా పెరిగింది. 

చాహల్ చదరంగంలో కూడా ప్రావీణ్యం సంపాదించాడు. గ్రాండ్ మాస్టర్ స్థాయిలో అతను పావులు కదుపుతాడని సమాచారం. జాతీయ స్థాయి పోటీల్లో అతను బహుమతులు కూడా గెలుచుకున్నాడు. ప్రస్తుతం టీమిండియాలో కీలకమైన బౌలర్ గా మారిపోయాడు.

 

PREV
click me!

Recommended Stories

IND vs SA : నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. తొలి టీ20లో సౌతాఫ్రికా చిత్తు
ఒరేయ్ అజామూ.! భారత్‌లో కాదు.. పాకిస్తాన్‌లోనూ కాటేరమ్మ కొడుకు క్రేజ్ చూస్తే మతిపోతోంది