రియల్ క్రేజీ గేమ్: ఇండియా సూపర్ ఓవర్ విన్ పై రవిశాస్త్రి

By telugu team  |  First Published Feb 1, 2020, 9:30 AM IST

న్యూజిలాండ్ పై నాలుగో టీ20లో సూపర్ ఓవరులో ఇండియా విజయం సాధించడంపై కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. నిజంగా ఇది రియల్ క్రేజీ గేమ్ అని వ్యాఖ్యానించాడు. దానిపై నెటిజన్లు స్పందిస్తున్నారు.


వెల్లింగ్టన్: న్యూజిలాండ్ పై వరుసగా రెండు సూపర్ ఓవర్లలో తమ జట్టు విజయం సాధించడంపై టీమిండియా కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. ట్విట్టర్ వేదికగా ఆయన తన స్పందనను తెలియజేశాడు. నాలుగో వన్డేలో కూడా సూపర్ ఓవరులో విజయం సాధించడంపై స్పందిస్తూ...  రియల్ క్రేజీ గేమ్ ఇదేనని వ్యాఖ్యానించాడు.

ట్విట్టర్ వేదికగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా స్పందించాడు ప్రతీ సవాల్ నూ ఎదుర్కోవడానికి తాము సిద్ధమవుతున్నామని ఆయన అన్నిాడు. ఇదో అద్భుతమైన ఆట అని అన్నాడు.

Latest Videos

undefined

కివీస్ క్రికెటర్లు బాగా ఆడారని, అయితే వారు సూపర్ ఓవర్ లో రాణించలేకపోతున్నారని మైఖెల్ వాన్ అన్నాడు. శార్దూల్ ఠాకూర్ చేయి చాలా పెద్దదని, మంచి ప్రదర్శన చేశావ్ సోదరా అని ఇర్ఫాన్ పఠాను అన్నాడు.

వరుస మ్యాచుల్లో సూపర్ ఓవరు జరగడం చాలా బాగుందని వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. చివరి మూడు ఓవర్లలో భారత పేసర్లు అద్భుతంగా రాణించారని కొనియాడాడు. 18 పరుగులను కాపాడుకున్నారని అన్నిాడు. చివరి వరకు పోరాడి విజయం సాధించడాన్ని ఆస్వాదిస్తున్నట్లు తెలిపాడు. ఇదో అద్భుతమైన విజయమని అన్నాడు.

తమ ముందు ఉంచిన 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో న్యూజిలాండ్ విఫలమైంది. మ్యాచ్ ను మాత్రం టై చేయగలిగింది. శార్దూల్ ఠాకూర్ దెబ్బకు చివరి ఓవరులో కివీస్ బ్యాట్స్ మెన్ కంగు తిన్నారు. సూపర్ ఓవరులో న్యూజిలాండ్ తమ ముందు ఉంచిన 14 పరుగుల లక్ష్యాన్ని కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ కలిసి ఛేదించారు.

మ్యాచ్ 20వ చివరి ఓవరులో ఓ బౌండరీ ఇచ్చిన శూర్దాల్ ఠాకూర్ రెండు వికెట్లు తీయడమే కాకుండా మిచెల్ సాంత్నర్ ను రన్నవుట్ చేశాడు.

సూపర్ ఓవరులో జస్ ప్రీత్ బుమ్రా బౌలింగ్ చేసి 13 పరుగులు ఇచ్చాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన కేఎల్ రాహుల్ తొలి రెండు బంతులకు పది పరుగులు చేశాడు. మూడో బంతికి సౌథీ అతన్ని ఔట్ చేశాడు. అయితే, విరాట్ కోహ్లీ తర్వాతి రెండు బంతులను బౌండరీకి తరలించి విజయాన్ని అందించాడు. 

 

Can be a real crazy game 🇮🇳🙏 pic.twitter.com/F2LwaCjB5T

— Ravi Shastri (@RaviShastriOfc)
click me!