అంబటి రాయుడ్ని ఎలా చేశారంటే...: భగ్గుమన్న యువరాజ్ సింగ్

By telugu teamFirst Published Dec 18, 2019, 12:49 PM IST
Highlights

వన్డే ప్రపంచ కప్ పోటీల్లో భారత క్రికెట్ టీమ్ మేనేజ్ మెంట్ వ్యవహరించిన తీరుపై యువరాజ్ సింగ్ భగ్గుమన్నాడు. అంబటి రాయుడి పట్ల వ్యవహరించిన తీరుపై ఆయన తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశాడు.

ముంబై: 2019 ప్రపంచ కప్ పోటీల్లో భారత ఓటమికి యువరాజ్ సింగ్ టీమ్ మేనేజ్ మెంట్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్తి తప్పుడు ప్రణాళికతో వివిధ అటగాళ్లతో కిచిడీగా తయారు చేసి ఆదడించారని ఆయన వ్యాఖ్యానించారు. 2019 ప్రపంచ కప్ పోటీల్లో టీమిండియా సెమీ ఫైనల్స్ లో న్యూజిలాండ్ పై 18 పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. 

ఈ ప్రపంచ కప్ పోటీలకు సంబంంధించి జట్టు నుంచి అంబటి రాయుడిని తప్పించారని, గాయంతో బాధపడుతున్న విజయ్ శంకర్ ను జట్టులోకి తెచ్చారని, ఆ తర్వాత రిషబ్ పంత్ ను జట్టులో చేర్చారని ఆయన అన్నారు. విజయ్ శంకర్, రిషబ్ పంత్ లపై తనకు ఏ విధమైన వ్యతిరేకత లేదని, అయితే, వారిద్దరు కూడా ఐదు వన్డేలు మాత్రమే ఆడారని, అంత తక్కువ ఉన్న ఆటగాళ్లు మ్యాచ్ ను గెలిపిస్తారని ఎలా అనుకుంటారని ఆయన అన్నాడు.

తన ఆక్షేపణ అంతా థింక్ ట్యాంక్ గురించేనని యువీ అన్నాడు. దినేష్ కార్తిక్ అకస్మాత్తుగా సెమీ ఫైనల్ లో ఆడాడని, ధోనీని 7వ స్థానంలో బ్యాటింగ్ కు దించారని, అదంతా కిచిడీ వ్యవహారమని, పెద్ద మ్యాచుల్లో ఇటువంటివి చేయకూడదని అన్నాడు. 

నెంబర్ ఫోర్ బ్యాట్స్ మన్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 48 పరుగులేనని, ప్రణాళిక చాలా చెత్తగా ఉందని ఆయన అన్నాడు. రోహిత్, విరాట్ కోహ్లీ బాగా ఆడుతున్నారని భావించి అలా చేశారని, అయితే జట్టు అలా విజయం సాధించలేదని అన్నాడు. ఆస్ట్రేలియాను చూస్తే అర్థమవుతుందని ఆయన అన్నాడు. 

నెంబర్ 4లో అత్యుత్తమ క్రీడాకారుడిగా అంబటి రాయుడిని భావించారని, అయితే అకస్మాత్తుగా అతన్ని పక్కన పెట్టేశారని, ఆ తర్వాత స్టాండ్ బైగా పెట్టారని గుర్తు చేశాడు. శిఖర్ ధావన్, విజయ్ శంకర్ జట్టు నుంచి తొలిగిన తర్వాత కూడా అంబటి రాయుడిని జట్టులోకి తీసుకోలేదని ఆయన విమర్శించారు 

రాయుడు విషయంలో టీమ్ మేనేజ్ మెంట్ వ్యవహరించిన తీరుపై యువీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. రాయుడికి జరిగినదానికి తాను చింతిస్తున్నానని అన్నాడు. ఏడాదికి పైగా నెంబర్ 4 గా బ్యాటింగ్ చేస్తూ వచ్చాడని, అంతకు ముందు న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచులో 90 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా కూడా ఎంపికయ్యాడని అన్నాడు. 

click me!