వరల్డ్ కప్ లో ఓటమికి కారణం ఇదే... యూవీ సంచలన కామెంట్స్

By telugu teamFirst Published Dec 18, 2019, 10:48 AM IST
Highlights

అంబటి రాయుడు విషయంలో వారు ప్రవర్తించిన తీరు కూడా సరిగా లేదని యూవీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. విజయ్ శంకర్, రిషభ్ పంత్ వంటి అనుభవం లేని వారిని ప్రపంచకప్ టోర్నీలకు ఎంపిక చేయడం ఏమిటని ప్రశ్నించాడు.


టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఇండియన్ క్రికెట్ జట్టు యాజమాన్యంపై సంచలన కామెంట్స్ చేశారు. 2019 వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా సెమిస్ లోనే వెనక్కి వచ్చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఆ టోర్నీ ఓడిపోవడానికి అసలు కారణం యాజామాన్యం తీసుకున్న నిర్ణయాలే అంటూ...యూవీ పేర్కొన్నారు. తాజాగా.. యూవీ ఓ జాతీయ మీడియా సంస్థకు  ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ ఇంటర్వ్యూలో ఆయన యాజమాన్యం తీరుపై మండిపడ్డారు. మిడిల్ ఆర్డర్ లో అనుభవం లేని ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం వల్లే జట్టు ఓడిపోయిందని యూవీ అభిప్రాయపడ్డారు. టాప్ ఆర్డర్ కి అనుగుణంగా మిడిల్ ఆర్డర్ లో సరైన ఆటగాళ్లను ఎంపిక చేయలేకపోయిందని విమర్శించాడు.

AlsoRead భార్య సాక్షిపై ఎంఎస్ ధోనీ పైర్: వీడియో వైరల్...

అంబటి రాయుడు విషయంలో వారు ప్రవర్తించిన తీరు కూడా సరిగా లేదని యూవీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. విజయ్ శంకర్, రిషభ్ పంత్ వంటి అనుభవం లేని వారిని ప్రపంచకప్ టోర్నీలకు ఎంపిక చేయడం ఏమిటని ప్రశ్నించాడు.

తానేమీ రిషబ్ పంత్, విజయ్ శంకర్ లకు వ్యతిరేకంగా మాట్లాడటం లేదని... వారికి కేవలం ఐదు వన్డేలు మాత్రమే ఆడిన అనుభవం ఉందని యూవీ పేర్కొన్నాడు. అలా తక్కువ అనుభవం ఉన్న వారి నుంచి మంచి ఆటను ఎలా ఊహించగలమన్నాడు. నిజంగా జట్టు యాజమాన్యం సరైన ప్రణాళికలు తీసుకోకపోపవడంపై విఫలమైందని అన్నారు. 

click me!