IPL 2022: క్యా బాల్ హై నట్టూ.. షాహీన్ అఫ్రిదిని గుర్తుకు తెచ్చిన యార్కర్ కింగ్.. బాల్ ఆఫ్ ది సీజన్ ఇదే..

Published : Apr 09, 2022, 04:58 PM IST
IPL 2022: క్యా బాల్ హై నట్టూ.. షాహీన్ అఫ్రిదిని గుర్తుకు తెచ్చిన యార్కర్ కింగ్.. బాల్ ఆఫ్ ది సీజన్ ఇదే..

సారాంశం

TATA IPL 2022 - SRH vs CSK: చెన్నై సూపర్ కింగ్స్  తో  కీలక మ్యాచ్ ఆడుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.  అయితే  మూడు ఫోర్లు కొట్టి జోరు మీద కనిపించిన చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ను నటరాజన్  అత్యద్భుత డెలివరీతో బౌల్డ్ చేశాడు. 

ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా  చెన్నై సూపర్ కింగ్స్ - సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతున్న  మ్యాచ్ లో  ఎస్ఆర్హెచ్ బౌలర్, యార్కర్ కింగ్ టి. నటరాజన్ సంచలన డెలివరీ విసిరాడు.  గత మూడు మ్యాచులలో విఫలమై  తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్న గతేడాది ఆరెంజ్ క్యాప్ విన్నర్ రుతురాజ్ గైక్వాడ్.. ఈ మ్యాచులో ఎలాగైనా బాగా ఆడాలని పట్టుదలగా  క్రీజులోకి వచ్చాడు.  ఎదుర్కున్న 13 బంతుల్లోనే 3 ఫోర్లు కొట్టి 16 పరుగులు చేశాడు. అయితే టి. నటరాజన్ వేసిన ఓ బంతికి  క్లీన్ బౌల్డ్ అయ్యాడు.  ఆ బంతి.. గతేడాది దుబాయ్ వేదికగా ముగిసిన  టీ20 ప్రపంచకప్ లో  టీమిండియా స్టార్ బ్యాటర్  కెఎల్ రాహుల్ ను పాకిస్థాన్ పేసర్ షాహీన్ షా అఫ్రిది బౌల్డ్ చేసిన బాల్ ను గుర్తుకు తెచ్చింది. 

టీ20 ప్రపంచకప్ లో  తొలి ఓవర్లోనే రోహిత్ ను ఔట్ చేసి షాకిచ్చిన అఫ్రిది.. తన రెండో ఓవర్లో మొదటి బంతికే  రాహుల్ కు బాల్ విసిరాడు.  ఆఫ్ స్టంప్ దిశగా వెళ్తుందనుకున్న ఆ బంతి అనూహ్యంగా స్వింగ్ అయి లోపలికి దూసుకొచ్చింది. క్షణాల్లోనే  మిడిల్ వికెట్ ను ఎగురగొట్టింది. 

 

తాజాగా  నట్టూ కూడా అదే స్థాయి ప్రదర్శన చేశాడు.  మూడు ఫోర్లు కొట్టి తన ఉద్దేశం చాటిన  రుతురాజ్ గైక్వాడ్ ను ఇన్నింగ్స్  ఆరో ఓవర్ తొలి బంతికే  క్లీన్ బౌల్డ్ చేశాడు. తొలి ఓవర్ వేసిన నట్టూ... యార్కర్ గా బంతిని సంధించాడు.  బంతిని అంచనా వేయడంలో  గైక్వాడ్  విఫలమైనా.. నట్టూ మాత్రం మిస్ అవలేదు. ఏకంగా మధ్యలో వికెట్ ఎగిరిపోయింది.  

 

దీంతో సోషల్ మీడియాలో అభిమానులు ఈ రెండు డెలివరీలకు సంబంధించిన  వీడియోలను పోస్టు చేస్తున్నారు.  యార్కర్ల కింగ్ అయిన నట్టూ  విసిరిన బంతి.. ఇప్పటివరకు ఐపీఎల్ 2022 లో ‘బాల్ ఆఫ్ ది సీజన్’ అని ప్రశంసిస్తున్నారు.  

ఇదిలాఉండగా.. టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన చెన్నై. 16  ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 113పరుగులు చేసింది. క్రీజులో ఎంఎస్ ధోని (3 నాటౌట్) రవీంద్ర జడేజా (2 నాటౌట్) లు ఉన్నారు. రాబిన్ ఊతప్ప (15), రుతురాజ్ (16), మోయిన్ అలీ (48), అంబటి రాయుడు (27) లు పెవిలియన్ కు చేరారు. వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు తీయగా.. టి. నటరాజన్ ఒకటి, మార్క్రమ్ ఒక వికెట్ తీశారు. 

PREV
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !