
భారత్‌లో లెస్బియన్, గే వివాహాలు చాలా పెద్ద విషయమేమో కానీ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా వంటి దేశాల్లో స్వలింగ సంపర్కులు కలిసి ఉండడం, పిల్లలను కనడం చాలా కామన్ అయిపోయింది. తాజాగా ఇంగ్లాండ్ మాజీ వికెట్ కీపర్ సారా టేలర్ త్వరలో ఓ బిడ్డకు పేరెంట్‌గా మారబోతున్న విషయం ప్రకటించిన విషయం తెలిసిందే.
ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సారా టేలర్ ఈ విషయాన్ని ప్రకటించడంతో అభిమానులు షాక్‌కి గురయ్యారు. దీంతో ఆమెకు వేల మెసేజ్‌లు, మెయిల్స్ వచ్చాయిట. అభిమానుల నుంచి ప్రశ్నల వర్షం కురుస్తుండడంతో సోషల్ మీడియా ద్వారా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది సారా టేలర్..
‘నా పార్టనర్ ప్రెగ్నెన్సీ గురించి చెప్పగానే నాకు ఎన్నో మెయిల్స్ వచ్చాయి, మరెన్నో ప్రశ్నలు తలెత్తాయి. వాటిల్లో కొన్ని విషయాలకు నేను క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నా. అవును... తను తల్లి కావడానికి వీర్యం, ప్రతీ ఒక్కరి ముఖంలో సంతోషాన్ని చూడాలనుకునే ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి దానంగా తీసుకున్నాం.
అవును నేను లెస్బియన్‌నే. ఎన్నో ఏళ్లుగా లెస్బియన్‌గానే ఉన్నాను. అది నా ఛాయిస్ కాదు. నేను ఎంతో ఇష్టపడి, కోరుకుని ఎంచుకున్న సంతోషం. అది విషయం. ప్రతీ కుటుంబం వేరుగా ఉంటుంది. అది నడిచే విధానం వేరుగా ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ముందు కాస్త పరిజ్ఞానం పెంచుకోండి. మా బేబీని మేం ప్రేమిస్తాం, తనకు కావాల్సిన సపోర్ట్ అంతటినీ అందిస్తాం.
నేను ఎదుటివారి ఫీలింగ్స్‌ని జడ్జ్ చేయను. ఎవరేం అనుకున్నా పట్టించుకోను. అయితే ద్వేషం, దూషణలకు అడ్డుకట్ట వేయాలని ఇలా సమాధానం ఇస్తున్నాం. నువ్వు సంతోషంగా ఉంచేది ఏదైనా దాన్ని వదలకు.. మాకు అండగా నిలిచిన వారికి థ్యాంక్స్.. లవ్ ఈజ్ లవ్’ అంటూ సుదీర్ఘంగా రాసుకొచ్చింది సారా టేలర్..
2016లో మెంటల్ హెల్త్ కారణాలతో క్రికెట్‌కి బ్రేక్ తీసుకున్న సారా టేలర్.. 2019లో క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ప్రకటించింది...
‘అమ్మకావాలనేది నా పార్టనర్ కల. ఆ జర్నీ అంత ఈజీ కాదు. అయితే డియానా ఎప్పుడూ పట్టువదల్లేదు. ఆమె బెస్ట్ మమ్మీ అవుతుందని నాకు తెలుసు. నేను ఈ కుటుంబంలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. 19 వారాల్లో జీవితం మారిపోనుంది...’ అంటూ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియచేసింది సారా టేలర్...
గుడ్‌న్యూస్ చెప్పిన సారా టేలర్‌కి ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ శుభాకాంక్షలు తెలిపాడు. ‘కంగ్రాట్స్ లెజెండ్. ఓ అద్భుతమైన ప్రయాణం ఎదురుచూస్తోంది...’ అంటూ కామెంట్ చేశాడు గిల్‌క్రిస్ట్.
అత్యంత అందమైన మహిళా క్రికెటర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న సారా టేలర్, స్టార్ ప్లేయర్‌గా ఎదుగుతున్న సమయంలోనే ఒంటి మీద నూలు పోగు లేకుండా న్యూడ్ ఫోటోషూట్‌లో పాల్గొని, అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది...
పురుషుల క్రికెట్ జట్టుకి కోచ్‌గా బాధ్యతలు పూర్తి చేసి, సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది సారా టేలర్.అబుదాబీ టీ10 లీగ్‌లో అబుదాబీ జట్టుకి అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించిన సారా టేలర్, దానికి ముందు ఇంగ్లాండ్ మెన్స్ కౌంటీ టీమ్ సుసెక్స్ టీమ్‌కి స్పెషలిస్ట్ కోచ్‌గానూ బాధ్యతలు నిర్వర్తించింది...
అంతేకాదు ప్రొఫెషనల్ మెన్స్ క్రికెట్ టీమ్‌లో ఆడిన మొట్టమొదటి మహిళా క్రికెటర్‌గానూ సారా టేలర్‌కి రికార్డు ఉంది... ఆస్ట్రేలియాలో నార్తన్ డిస్ట్రిక్స్ మెన్స్ జట్టుకి వికెట్ కీపర్‌గా ఆడింది సారా. 33 ఏళ్ల సారా టేలర్ తన కెరీర్‌లో ఇంగ్లాండ్ తరుపున 10 టెస్టు మ్యాచులు, 126 వన్డేలు, 90 టీ20 మ్యాచులు ఆడింది.
టెస్టుల్లో 300 పరుగులు చేసిన సారా టేలర్, వన్డేల్లో 7 సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలతో 4056 పరుగులు చేసింది. అలాగే 90 టీ20 మ్యాచుల్లో 16 హాఫ్ సెంచరీలతో 2177 పరుగులు చేసింది. వికెట్ కీపర్‌గా 138 క్యాచులు అందుకున్న సారా టేలర్, 104 స్టంపౌట్లు చేసింది..