Year Ender 2023: ఈ ఏడాది చాలా మంది ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. కొంతమంది వయస్సు బట్టి రిటైర్డ్మెంట్ ప్రకటించగా.. మరికొందరూ ఆటగాళ్ళు T-20 ఫార్మాట్‌పై దృష్టి పెట్టడానికి అంతర్జాతీయ క్రికెట్‌ను విడిచిపెట్టారు. 2023లో అంతర్జాతీయ క్రికెట్ కు ఉద్వాసన పలికిన ఆటగాళ్ల జాబితాపై మీరు కూడా ఓ లూక్కేయండి.
Year Ender 2023: 2023 సంవత్సరం వీడ్కోలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఎన్నో కొత్త ఆశాలు ..ఆశయాలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. ఈ తరుణంలో క్రికెట్ అభిమానులు ఈ ఏడాది జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. వరల్డ్ కప్ ఫైనల్‌లో టీమ్ ఇండియా ఓడిపోవడం 2023 లో ఓ చేదు జ్ఞాపకం అయినప్పటికీ, ఈ ఏడాది ఇతర సిరీస్ లో చాలా బాగా రాణించింది. అదే సమయంలో ఈ ఏడాది చాలా మంది ఆటగాళ్ళు కూడా ఆటకు వీడ్కోలు పలికారు. వీరిలో చాలా మంది ఆటగాళ్లు వన్డే ప్రపంచకప్ 2023 తర్వాత క్రికెట్‌కు దూరమవుతున్నట్టు ప్రకటించారు.
ఈ ఏడాది ఏ ఏ ఆటగాళ్లు వీడ్కోలు పలికారు?
undefined
దక్షిణాఫ్రికాకు చెందిన డ్వేన్ ప్రిటోరియస్ జనవరి 2023లో రిటైర్మెంట్ ప్రకటించారు. అతనితో పాటు లెజెండ్ క్రికెటర్ హషీమ్ ఆమ్లా కూడా రిటైర్మెంట్ తీసుకున్నాడు. అతను ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌ను విడిచిపెట్టాడు. అయితే ఈ ఏడాది నుంచి క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌లకు వీడ్కోలు పలికాడు హషీమ్ ఆమ్లా .
ఇక టీమిండియా ఆటగాళ్లను పరిశీలిస్తే.. టీ20 ప్రపంచకప్ విజేత జట్టు సభ్యుడు జోగిందర్ శర్మ ఈ ఏడాది రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ-20 వరల్డ్‌కప్ ఫైనల్‌లో చివరి ఓవర్ బౌలింగ్ చేసి మిస్బా ఉల్ హక్ వికెట్ పడగొట్టాడు. జోగిందర్ శర్మతో పాటు మురళీ విజయ్, మనోజ్ తివారీ, అంబటి రాయుడు లు ఈ ఏడాది రిటైర్మెంట్ ప్రకటించారు.
ఇతర విదేశీ ఆటగాళ్ల విషయానికి వస్తే.. ఆస్ట్రేలియాకు T20 ప్రపంచ కప్ గెలిచిన కెప్టెన్ ఆరోన్ ఫించ్, ఇంగ్లండ్ స్టార్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్, ఇంగ్లాండ్‌కు చెందిన మొయిన్ అలీ కూడా ఈ సంవత్సరం రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే.. మొయిన్ అలీ యాషెస్ ఆడేందుకు తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్నాడు. యాషెస్ తర్వాత అతను మళ్లీ రిటైరయ్యాడు.
ప్రపంచకప్ సమయంలోనూ చాలా మంది రిటైర్మెంట్లు ప్రకటించారు. ఇటీవల ODI ప్రపంచ కప్ భారతదేశంలో జరిగింది. ఈ సమయంలో చాలా మంది ఆటగాళ్ళు రిటైర్మెంట్ ప్రకటించారు. ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన నవీన్ ఉల్ హక్ కేవలం 24 సంవత్సరాల వయస్సులో వన్డే నుండి రిటైర్ అయ్యాడు. అతనితో పాటు దక్షిణాఫ్రికాకు చెందిన క్వింటన్ డి కాక్, ఆస్ట్రేలియా చెందిన డేవిడ్ వార్నర్, ఇంగ్లాండ్‌కు చెందిన డేవిడ్ విల్లీ కూడా ప్రపంచ కప్ తర్వాత రిటైరయ్యారు. వీరే కాకుండా రిటైర్మెంట్ ప్రకటించని ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. ఇదే వారి చివరి ప్రపంచకప్ అని పరోక్షంగా రిటైర్డ్మెంట్ ప్రకటించారు.