
WTC Final : ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 (డబ్ల్యూటీసీ) ఫైనల్‌లో ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ జూన్ 11 నుండి 15 వరకు లండన్‌లోని లార్డ్స్ మైదానంలో జరుగనుంది. ఇది 2021–2023 డబ్ల్యూటీసీ సైకిల్‌కి కొనసాగింపుగా జరుగుతున్న రెండో ఫైనల్.
గత డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత జట్టును ఓడించిన ఆస్ట్రేలియా ఛాంపియన్ గా నిలిచింది. ఇప్పుడు టైటిల్‌ను నిలబెట్టుకోవాలని భావిస్తోంది. మరోవైపు, దక్షిణాఫ్రికా తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించి చరిత్ర సృష్టించింది. ఇదే తొలి సారి భారత్ ఫైనల్‌కు చేరుకోకుండా జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ కావడం గమనార్హం.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్ మ్యాచ్‌ను భారతదేశంలో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఇది తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తదితర భాషలలో లైవ్ కామెంటరీతో ప్రసారం కానుంది. అలాగే జియో సినిమా, జియో హాట్ స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా మ్యాచ్ లైవ్ స్ట్రీమ్ చూడొచ్చు. డీడీ స్పోర్ట్స్ లో కూడా చూడొచ్చు.
భారత కాలమానం ప్రకారం, డబ్ల్యూటీసీ ఫైనల్ జూన్ 11 మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది.
ప్యాట్ కమిన్స్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా, గత 19 టెస్ట్‌లలో 13 విజయాలతో బలంగా కనిపిస్తోంది. గత డబ్ల్యూటీసీ టైటిల్‌ను గెలుచుకున్న ఆస్ట్రేలియా, మరోసారి టైటిల్ గెలుచేందుకు సిద్ధంగా ఉంది.
దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా నేతృత్వంలోని జట్టు.. గత 7 మ్యాచ్‌లలో అన్నీ గెలిచి సూపర్ ఫామ్ లో ఉంది. ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు తొలిసారిగా ప్రవేశించిన దక్షిణాఫ్రికా, తొలి ప్రయత్నంలోనే టైటిల్ గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇటీవలి 5 మ్యాచ్‌లలో రెండు జట్లు రెండేసి విజయాలు సాధించాయి, ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. రెండు జట్ల మధ్య సమబలంగా పోటీ ఉండటం ఈ ఫైనల్‌ను మరింత ఆసక్తిని పెంచుతోంది.
ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్స్టాస్, మార్నస్ లాబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, అలెక్స్ కారీ, జోష్ ఇంగ్లిస్, కామెరాన్ గ్రీన్, బ్యూ వెబ్‌స్టర్, ప్యాట్ కమ్మిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, స్కాట్ బోలాండ్, నాథన్ లియాన్, మాట్ కుహ్నెమాన్. ట్రావెలింగ్ రిజర్వ్: బ్రెండన్ డాగెట్
టోనీ డి జోర్జి, ర్యాన్ రికెల్టన్, ఐడెన్ మార్క్రామ్, టెంబా బావుమా (కెప్టెన్), డేవిడ్ బెడింగ్‌హామ్, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెర్రెయిన్, వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కగిసో రబడ, లుంగి ఎన్గిడి, డేన్ ప్యాటర్సన్, కేశవ్ మహారాజ్.