ఎర్ర టీషర్ట్ చూసి ఫ్రస్టేట్ అయిన స్మిత్.. నీకో దండంరా బాబు.. వెళ్లిపో అంటూ చేతులెత్తి మొక్కిన అంపైర్

Published : Jun 10, 2023, 11:37 AM IST
ఎర్ర టీషర్ట్ చూసి ఫ్రస్టేట్ అయిన స్మిత్.. నీకో దండంరా బాబు.. వెళ్లిపో అంటూ చేతులెత్తి మొక్కిన అంపైర్

సారాంశం

WTC Final 2023:   ఆస్ట్రేలియా  మాజీ సారథి   స్టీవ్ స్మిత్   డబ్ల్యూటీసీ ఫైనల్ లో  భాగంగా తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసినా రెండో ఇన్నింగ్స్ లో మాత్రం  ఆ స్థాయిలో ఆడలేదు. 

ఆస్ట్రేలియా వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ భారత్ తో జరుగుతున్న   డబ్ల్యూటీసీ ఫైనల్ లో భాగంగా  తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసి రాణించాడు. కానీ రెండో ఇన్నింగ్స్   లో మాత్రం అతడు 34  పరుగులే చేశాడు. ఆట మూడో రోజు భాగంగా   ప్రేక్షకుల్లో కూర్చున్న ఓ వ్యక్తిని చూసి  ఫ్రస్ట్రేట్ అయ్యాడు.   సదరు ప్రేక్షకుడు రెడ్ టీషర్ట్ వేసుకుని రావడమే  అతడి ఫ్రస్ట్రేషన్ కు కారణమైంది.  స్మిత్ చెప్పినా అతడు వినకపోవడంతో స్వయంగా  ఆన్ ఫీల్డ్ అంపైర్ అతడిని  అక్కడ్నుంచి వెళ్లిపోవాలని  చేతులెత్తి మొక్కడం  గమనార్హం. 

ఆసీస్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా  స్మిత్ బ్యాటింగ్ చేస్తుండగా  అతడికి ఎదురుగా ఓ  ఇంగ్లాండ్ ఫ్యాన్.. రెడ్ టీషర్ట్  వేసుకుని మ్యాచ్ చూస్తున్నాడు. స్మిత్ ను ఆ రెడ్ టీషర్ట్ ఇబ్బందికి గురి చేసింది. ఇదే విషయాన్ని అతడు అంపైర్ కు కూడా కన్వే చేశాడు. 

అయితే సదరు ప్రేక్షకుడు  తానెందుకు అక్కడ్నుంచి వెళ్లాలని అక్కడే ఉండిపోయాడు. చివరికి ఆన్ ఫీల్డ్ అంపైర్   జోక్యం చేసుకుని.. ‘ప్లీజ్, నీకు దండం పెడతా. అక్కడ్నుంచి వేరే చోట కూర్చో..’అని   చేతులెత్తి మొక్కాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా  మారాయి.  ఫ్రస్ట్రేట్ అయిన కొద్దిసేపటికే స్మిత్.. రవీంద్ర జడేజా బౌలింగ్ లో భారీ షాట్ ఆడబోయి శార్దూల్ ఠాకూర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.  

 

 

ఈ ఫోటోపై  పలువురు ఫన్నీగా స్పందిస్తూ.. ‘స్టీవ్ స్మిత్ బలహీనత ఏంటో ఇంగ్లాండ్ కు తెలిసిపోయింది.  అతడి బలహీనత మీద కొట్టగలిగితే తప్ప  ఇంగ్లాండ్ బౌలర్లకు అతడు కొరకరాని కొయ్య అవుతాడు.  స్మిత్ కు రెడ్ అంటే పడనట్టుంది.  ఇంగ్లాండ్ ఫ్యాన్స్ అంతా  రాబోయే యాషెస్ సిరీస్ లో   రెడ్ టీ షర్ట్స్ వేసుకుని రండి..’అని  కామెంట్ చేస్తున్నారు. కొంతమంది  అయితే.. ‘ఈ  ఫోటో, వీడియో చూసిన తర్వాత  బెన్ స్టోక్స్ అర్జెంట్ గా  50 వేల రెడ్ టీషర్ట్స్ ఆర్డర్ ఇచ్చే ఆలోచన చేస్తున్నాడు.. రేపు పొద్దున్నుంచి అతడు అదే పనిలో ఉంటాడు..’ అని ఫన్నీగా స్పందిస్తున్నారు. మరికొందరు.. ‘జూన్ 16 నుంచి యాషెస్ టెస్టు సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో  ఫస్ట్ టెస్ట్ జరిగే ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో ఇంగ్లాండ్ ఫ్యాన్స్ దాదాపు 25 వేల మంది రెడ్ టీషర్ట్స్ తోనే  మ్యాచ్ చూసేందుకు రానున్నారని  విశ్వసనీయవర్గాల సమాచారం..’అని కామెంట్స్ చేస్తున్నారు. 


 

PREV
click me!

Recommended Stories

T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !
T20 World Cup: దటీజ్ ఇషాన్ కిషన్.. వరల్డ్ కప్ జట్టులో చోటు కోసం ఏం చేశాడో తెలుసా?