భార్య ని తన కెమేరాతో బంధించిన చాహల్.. క్యూట్ పిక్స్ వైరల్..!

By telugu news teamFirst Published Jun 10, 2023, 10:45 AM IST
Highlights

ఆమె బ్రేక్ ఫాస్ట్ చేస్తుండగా, చాహల్ ఆమెను తన కెమేరాలో బంధించాడు. భార్యను చాలా అందంగా ఫోటోలు తీశాడు. ఇంకేముంది ఆ ఫోటోలు కాస్త నెట్టింట వైరల్ గా మారాయి.

టీమిండియా క్రికెటర్ యజ్వేంద్ర చాహాల్ భార్య ధనశ్రీ వర్మ గురించి క్రికెట్ ఫ్యాన్స్‌కి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చాహల్ తో పెళ్లి కి ముందు డ్యాన్సర్ గా, డాక్టర్ గా గుర్తింపు పొందింది. డ్యాన్స్ తోనే చాహల్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. కాగా, అప్పటి నుంచి వీరు తమ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటూనే ఉన్నారు.

ధనశ్రీ అందానికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే ఆమె కూడా ఎప్పటికప్పుడు తన ఫోటోలు షేర్ చేసి ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా ఆమె బ్రేక్ ఫాస్ట్ చేస్తుండగా, చాహల్ ఆమెను తన కెమేరాలో బంధించాడు. భార్యను చాలా అందంగా ఫోటోలు తీశాడు. ఇంకేముంది ఆ ఫోటోలు కాస్త నెట్టింట వైరల్ గా మారాయి.

 

ధనశ్రీ వర్మ, ఈ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసి, చాహల్ ఈ ఫోటోలు తీశాడంటూ ఆమె కామెంట్ చేయడం గమనార్హం. బ్యూటిఫుల్, హాట్ అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా, ధనశ్రీ వర్మ, యుజ్వేంద్ర చాహల్ 2020లో గురుగ్రామ్‌లో ఒక సన్నిహిత వేడుకలో వివాహం చేసుకున్నారు. మధ్యలో వీరు విడిపోతున్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ, అదేమీ లేదని తాము కలిసే ఉన్నామంటూ ఈ జంట క్లారిటీ ఇవ్వడం విశేషం. 

click me!