WPL Final 2024: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్ 2024) రెండో ఎడిషన్ లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు నాలుగు మ్యాచ్లు ఆడగా, ఆర్సీబీపై నాలుగింటిలో డీసీ విజయం సాధించింది. ఈ సారి ఫైనల్లో ఏ జట్టు గెలిచినా కొత్త ఛాంపియన్ గా అవతరిస్తుంది.
DC vs RCB - WPL Final 2024: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టైటిల్ కోసం మెగ్ లానింగ్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ మార్చి 17న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో స్మృతి మంధాన నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన టీమ్ కొత్త ఛాంపియన్ గా నిలవనుంది. ఇప్పటివరకు సాగిన టోర్నమెంట్ ను పరిశీలిస్తే ఢిల్లీ క్యాపిటల్ ఎనిమిది మ్యాచ్ ల్లో ఆరింటిలో గెలిచి 12 పాయింట్లు సాధించింది రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయి +1.198 నెట్ రన్ రేట్ ను కలిగి ఉంది. మరోవైపు ముంబై ఇండియన్స్ తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో ఆర్సీబీ 5 పరుగుల తేడాతో ముంబైని ఓడించింది. దీంతో ఆర్సీబీ 8 మ్యాచ్ లలో 4 గెలిచి నెట్ రన్ రేటు +0.306 స్కోరు సాధించింది.
Tata IPL 2024 కు దూరమైన టాప్-8 స్టార్ క్రికెటర్లు.. ఎందుకంటే..?
డీసీ వర్సెస్ ఆర్సీబీ, డబ్ల్యూపీఎల్ ఫైనల్ 2024
డబ్ల్యూపీఎల్లో రెండు సెషన్లలో డీసీ, ఆర్సీబీ నాలుగు మ్యాచ్లు ఆడగా, ఆర్సీబీపై నాలుగింటిలో డీసీ విజయం సాధించింది. దీంతో ఫైనల్ లోనూ ఢిల్లీ క్యాపిటల్స్ ఫెవరెట్ గా బరిలోకి దిగుతోంది. ఆర్సీబీ ఫైనల్ కు చేరడం ఇది తొలిసారి.
డీసీ వర్సెస్ ఆర్సీబీ, డబ్ల్యూపీఎల్ ఫైనల్ 2024 ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది?
మార్చి 17న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో డీసీ వర్సెస్ ఆర్సీబీ డబ్ల్యూపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
డీసీ వర్సెస్ ఆర్సీబీ, డబ్ల్యూపీఎల్ ఫైనల్ 2024 టైమింగ్?
డీసీ వర్సెస్ ఆర్సీబీ డబ్ల్యూపీఎల్ ఫైనల్ 2024 రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది.
డీసీ వర్సెస్ ఆర్సీబీ, డబ్ల్యూపీఎల్ ఫైనల్ 2024 ను ఎక్కడ ప్రసారమవుతుంది?
డీసీ వర్సెస్ ఆర్సీబీ, డబ్ల్యూపీఎల్ ఫైనల్ 2024ను స్పోర్ట్స్ 18 నెట్వర్క్ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
డీసీ వర్సెస్ ఆర్సీబీ, డబ్ల్యూపీఎల్ ఫైనల్ 2024 లైవ్ స్ట్రీమింగ్?
డీసీ వర్సెస్ ఆర్సీబీ, డబ్ల్యూపీఎల్ ఫైనల్ 2024 లైవ్ స్ట్రీమింగ్ జియో సినిమా యాప్, వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటుంది.
డీసీ వర్సెస్ ఆర్సీబీ, డబ్ల్యూపీఎల్ ఫైనల్ 2024: తుది జట్లు ఇవే..
ఢిల్లీ క్యాపిటల్స్: ఆలిస్ క్యాప్సీ, అన్నాబెల్ సదర్లాండ్, అరుంధతి రెడ్డి, జెమీమా రోడ్రిగ్స్, జెస్ జొనాసెన్, లారా హారిస్, షెఫాలీ వర్మ, రాధా యాదవ్, శిఖా పాండే, మారిజానే కాప్, స్నేహ దీప్తి, పూనమ్ యాదవ్, మెగ్ లానింగ్ (కెప్టెన్), మిన్ను మణి, తానియా భాటియా (వికెట్ కీపర్), టిటాస్ సాధు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు :ఆశా శోభన, దిశా కసత్, ఎలిస్ పెర్రీ, హీథర్ నైట్ (వికెట్ కీపర్), ఇంద్రాణి రాయ్, కనికా అహుజా, రేణుకా సింగ్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), శ్రేయాంకా పాటిల్, స్మృతి మంధాన (కెప్టెన్), సోఫీ డివైన్, జార్జియా వరేహమ్, కేట్ క్రాస్, ఏక్తా బిష్త్, శుభా సతీష్, ఎస్ మేఘన, సిమ్రాన్ బహదూర్, సోఫీ మొలినెక్స్.
ధోని డీజిల్ ఇంజిన్ లాంటోడు.. మహీ రిటైర్ పై ఏబీ డివిలియర్స్ ఆసక్తికరమై కామెంట్స్ !