WPL 2024: డ‌బ్ల్యూపీఎల్ 2024 ఫైన‌ల్లో ఢిల్లీ ఆలౌట్.. బెంగ‌ళూరు ముందు ఈజీ టార్గెట్ !

By Mahesh Rajamoni  |  First Published Mar 17, 2024, 9:20 PM IST

WPL Final 2024: మహిళల ప్రీమియర్ లీగ్ క్రికెట్ ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ vs బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ త‌ల‌ప‌డ‌నున్నాయి. అద్భుత బౌలింగ్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టడంతో 113 ప‌రుగుల‌కే ఢిల్లీ క్యాపిటల్స్ కుప్ప‌కూలింది.
 


DC vs RCB - WPL Final 2024: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్ 2024) రెండో ఎడిష‌న్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్  తలపడుతున్నాయి.బెంగళూరు టీమ్ ఫైనల్ మ్యాచ్ లో అద్బుత బౌలింగ్ తో రాణించింది. దీంతో ప‌వ‌ర్ ప్లే త‌ర్వాత ఢిల్లీ క్యాపిట‌ల్స్ వ‌రుసగా వికెట్లు కోల్పోయింది.  10 ఓవర్లకే ఢిల్లీ క్యాపిటల్స్ కీలకమైన 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ త‌ర్వాత కూడా క్రీజులోకి వ‌చ్చిన ప్లేయ‌ర్లు ఎక్కువ సేపు నిల‌వ‌లేక‌పోయారు. వ‌రుసగా వికెట్లు స‌మ‌ర్పించుకోవ‌డంతో ఢిల్లీ క్యాపిట‌ల్స్ 18.3 ఓవ‌ర్ల‌లో 113 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది.

అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ప‌వ‌ర్ ప్లే లో మంచి శుభారంభం ల‌భించింది. షఫాలీ వర్మ ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ ఆడింది. 27 బంతుల్లో 44 పరుగులు చేసింది. తన ఇన్నింగ్స్ లో రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు బాదిన తర్వాత మోలినెక్స్ బౌలింగ్ లో క్యాచ్ గా వికెట్ల ముందు దొరికిపోయింది. అప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ 64-1 పరుగులతో ప‌టిష్ఠ స్థితిలో క‌నిపించింది. అయితే, తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన జెమిమా రోడ్రిగ్స్ డకౌట్ గా వెనుదిరిగింది.

Latest Videos

undefined

IPL 2024: విరాట్ కోహ్లీ బెంగ‌ళూరు జట్టులో ఉన్న ఏకైక లోపం అదే.. !

తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఆలిస్ క్యాస్పేను కూడా సోఫీ మోలినెక్స్ దెబ్బకొట్టింది. మరిజానే కాప్ 8 పరుగులకు, జెస్ జోనాస్సెన్ 3 పరుగులు చేసి ఔట్ అయ్యారు.తొలి వికెట్ పడిన తర్వాత ఒత్తిడికి గురైన ఢిల్లీ బ్యాటర్స్ వరుసగా వికెట్లను సమర్పించుకున్నారు. రాధా యాద‌వ్ 12, అరుంధ‌తి రెడ్డి  10 ప‌రుగులు చేశారు. 18.3 ఓవ‌ర్ల‌లో 113 ప‌రుగుల‌కు ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఆలౌట్ అయింది. బెంగ‌ళూరు ముందు 114 ప‌రుగుల ఈజీ టార్గెట్ ను ఉంచింది. బెంగ‌ళూరు బౌల‌ర్ల‌లో సోఫీ మోలినెక్స్ 3 వికెట్లు, ఆశా శోభన 2 వికెట్లు, శ్రేయాంక పాటిట్ 4 వికెట్లు తీసుకున్నారు.

ఢిల్లీ క్యాపిట‌ల్స్ వికెట్ల ప‌త‌నం: 

64-1 ( షఫాలీ వర్మ , 7.1), 64-2 ( రోడ్రిగ్స్ , 7.3), 64-3 ( ఆలిస్ క్యాప్సే , 7.4), 74-4 ( లానింగ్ , 10.4), 80-5 ( మారిజానే కాప్ , 13.1), 81- 6 ( జోనాసెన్ , 13.3), 87-7 ( మిన్ను మణి , 14.1), 101-8 ( రాధా యాదవ్ , 16.2), 113-9 ( అరుంధతి రెడ్డి , 18.2), 113-10 ( తనియా భాటియా , 18.3).

టీ20 ప్రపంచకప్‌కు ముందు ఐసీసీ కీలక నిర్ణయం.. స్టాప్ క్లాక్ రూల్ అంటే ఏమిటి?

 

click me!